S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/28/2016 - 18:07

దిల్లీ: తమిళనాడులో మాదిరి అతి తక్కువ ధరకే భోజనం, కొన్నిరకాల టిఫిన్లు అందించేందుకు దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు క్యాంటీన్లను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం దిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణకు నిధులు కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి సిసోదియా తెలిపారు. సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనల మేరకు రుచికరమైన భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

03/28/2016 - 18:06

చండీగఢ్: జాట్ కులస్థులకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక బిల్లును హర్యానా మంత్రిమండలి సోమవారం ఆమోదించింది. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. రిజర్వేషన్ల కోసం ఇటీవల హర్యానా జాట్‌లు భారీ ఎత్తున ఉద్యమించడంతో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

03/28/2016 - 14:23

దిల్లీ: జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్, మరో విద్యార్థి ఉమర్ ఖలీద్‌లు ఈ నెలాఖరులోగా దిల్లీని విడిచిపెట్టి వెళ్లకపోతే దుర్గాష్టమి (వచ్చే నెల 8)లోగా వారిని హతమారుస్తామని యుపికి చెందిన నవ్ నిర్మాణ సేన అనే రాజకీయ పార్టీ తన ఫేస్‌బుక్ పేజీలో హెచ్చరించింది.

03/28/2016 - 14:19

దిల్లీ: వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైశ్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితాలో ప్రాంతీయ భాషలకు సంబంధించి తెలుగులో ‘కంచె’ ఉత్తమ చిత్రంగా నిలిచింది.

03/28/2016 - 12:27

దిల్లీ: ఇక్కడి రాష్టప్రతి భవన్‌లో సోమవారం ఉదయం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయిదుగురికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 46 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. ధీరూబాయ్ అంబానీ (మరణానంతరం) తరఫున ఆయన కుటుంబ సభ్యులు పద్మవిభూషణ్ అందుకున్నారు.

03/28/2016 - 12:32

ముంబయి: హైదరాబాద్-ముంబయి ఎయిర్ ఇండియా విమానాన్ని ఇక్కడి ఎయిర్ పోర్టులో సోమవారం ఉదయం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో నుంచి పొగలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఇందులో ప్రయాణిస్తున్న 120 మంది ప్రయాణీకులను సురక్షితంగా కిందకు దించారు.

03/28/2016 - 12:26

దిల్లీ: కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించిన తెలుగు సినిమా ‘బాహుబలి’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. పురస్కారాల జాబితాను న్యాయనిర్ణేతల సంఘం ఈరోజు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది.

03/28/2016 - 05:32

రంగపర, మార్చి 27: అసోంలో పరివర్తనా పవనాలు బలంగా వీస్తున్నాయని, ఈ పవనాలు కాంగ్రెస్‌ను, దాని 15 ఏళ్ల దుష్టపాలనను కూల్చివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం రాష్ట్రంలోని రంగపరలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, గత అరవై ఏళ్లలో అసోంకోసం ఏం చేశామో కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల రోజున అభివృద్ధికోసం సరయిన మీట నొక్కండి.

03/28/2016 - 05:29

న్యూఢిల్లీ, మార్చి 27: విదేశాల్లో పనిచేస్తున్న రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) అధికారులు, ఉద్యోగులకు న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన నియమ, నిబంధనలను వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఎ) కింద ఈ వివరాలను వెల్లడించేందుకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ నిరాకరించింది.

03/28/2016 - 05:28

కోల్‌కతా, మార్చి 27: ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదాన్ని చేయించాలన్న అంశంపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ మరో అడుగు ముందుకు వేశారు. ఈ నినాదాన్ని అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.

Pages