S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/28/2016 - 12:27

దిల్లీ: ఇక్కడి రాష్టప్రతి భవన్‌లో సోమవారం ఉదయం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయిదుగురికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 46 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. ధీరూబాయ్ అంబానీ (మరణానంతరం) తరఫున ఆయన కుటుంబ సభ్యులు పద్మవిభూషణ్ అందుకున్నారు.

03/28/2016 - 12:32

ముంబయి: హైదరాబాద్-ముంబయి ఎయిర్ ఇండియా విమానాన్ని ఇక్కడి ఎయిర్ పోర్టులో సోమవారం ఉదయం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో నుంచి పొగలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఇందులో ప్రయాణిస్తున్న 120 మంది ప్రయాణీకులను సురక్షితంగా కిందకు దించారు.

03/28/2016 - 12:26

దిల్లీ: కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించిన తెలుగు సినిమా ‘బాహుబలి’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. పురస్కారాల జాబితాను న్యాయనిర్ణేతల సంఘం ఈరోజు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది.

03/28/2016 - 05:32

రంగపర, మార్చి 27: అసోంలో పరివర్తనా పవనాలు బలంగా వీస్తున్నాయని, ఈ పవనాలు కాంగ్రెస్‌ను, దాని 15 ఏళ్ల దుష్టపాలనను కూల్చివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం రాష్ట్రంలోని రంగపరలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, గత అరవై ఏళ్లలో అసోంకోసం ఏం చేశామో కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల రోజున అభివృద్ధికోసం సరయిన మీట నొక్కండి.

03/28/2016 - 05:29

న్యూఢిల్లీ, మార్చి 27: విదేశాల్లో పనిచేస్తున్న రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) అధికారులు, ఉద్యోగులకు న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన నియమ, నిబంధనలను వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఎ) కింద ఈ వివరాలను వెల్లడించేందుకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ నిరాకరించింది.

03/28/2016 - 05:28

కోల్‌కతా, మార్చి 27: ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదాన్ని చేయించాలన్న అంశంపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ మరో అడుగు ముందుకు వేశారు. ఈ నినాదాన్ని అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.

03/28/2016 - 05:23

చందోరీ, మార్చి 27: మహారాష్టల్రో చందోరీ గ్రామం మీదుగా సాగుతున్న గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో మూడు దశాబ్దాల తర్వాత పలు పురాతన దేవాలయాలు బయల్పడ్డాయి. నాసిక్‌కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ప్రస్తుతం మహారాష్టల్రోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అక్కడ గోదావరి పాయలు ఎండిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో పలు దేవాలయాలు బయల్పడ్డాయి.

03/28/2016 - 05:21

ఖరగ్‌పూర్, మార్చి 27: పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోదీ వామపక్షాలు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేరళల్లో నువ్వానేనా అంటూ అధికారంకోసం పోటీ పడుతున్న కాంగ్రెస్-వామపక్షాలు పశ్చిమ బెంగాల్‌లో చేతులు కలపడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ పార్టీల ధోరణి బెంగాలీల విజ్ఞతను సవాలు చేయడంగా, అవమానించడంగా ఉందన్నారు.

03/28/2016 - 05:17

అహ్మదాబాద్, మార్చి 27: గుజరాత్‌లోని పోరుబందర్ బిజెపి ఎంపి విఠల్ రాడాడియా ఓ వృద్ధుడ్ని పదే పదే కాలితో తన్నుతూ వీడియోకు చిక్కడం, అది సామాజిక మాధ్యమంలో సంచలనం సృష్టించడంతో ఆయనకు చిక్కులు మొదలైనాయి. ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న రాడాడియా టెంటులో చివరి వరసలో కూర్చుని ఉన్న ఓ వృద్ధుడి వద్దకు వెళ్లి పదే పదే కాలితో తన్నడం ఆ వీడియో దృశ్యాల్లో ఉంది.

03/28/2016 - 04:29

న్యూఢిల్లీ, మార్చి 27: పఠాన్ కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి ఘటనపై దర్యాప్తు జరపడం కోసం పాకిస్తాన్‌నుంచి అయిదుగురు సభ్యులతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందం ఆదివారం ఇక్కడికి చేరుకుంది. ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో దర్యాప్తు జరపడం కోసం పాకిస్తాన్‌కు చెందిన ఒక బృందం భారత్ రావడం ఇదే మొదటిసారి. ఈ బృందంలో పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చెందిన అధికారి కూడా ఉన్నారు.

Pages