S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/27/2016 - 02:49

చెన్నై, మార్చి 26: తమిళనాడులో వచ్చే మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె తమకు చాలా తక్కువ సీట్లు కేటాయించాలని అనుకుంటున్నట్లు వార్తలు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ కనీసం 45 సీట్లన్నా ఇచ్చేలా చూడాలని అనుకోవడమేకాక తమ అభిప్రాయాన్ని సీట్ల పంపిణీపై డిఎంకెతో చర్చలు జరుపుతున్న పార్టీ కేంద్ర నాయకులకు తెలియజేశారు.

03/27/2016 - 02:48

న్యూఢిల్లీ, మార్చి 26: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించాలని భారతీయ జనతా పార్టీ శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది.

03/27/2016 - 02:47

ముంబయి, మార్చి 26: ఇషత్ జహాన్ ఆపరేషన్ గురించి పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహమాన్ లఖ్వీ తనకు చెప్పాడని పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబయి ఉగ్రవాద దాడి కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు శనివారం చెప్పాడు. జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) తన స్టేట్‌మెంట్‌లో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదో అర్థం కావడం లేదని ఆయన అన్నాడు.

03/27/2016 - 02:46

తిరునల్‌వేలి, మార్చి 26: ఎన్నికలు వచ్చినప్పుడల్లా ‘తాయిలాలు’ చూపించి ఓట్లు దండుకోవడం డిఎంకె, ఎఐడిఎంకె పార్టీలకు అలవాటుగా మారిందని డిఎండికె-పిడబ్ల్యుఎఫ్ కూటమి నేత విజయకాంత్ భార్య ప్రేమలత విమర్శించారు. గత యాభైఏళ్లుగా ఈ రెండు ప్రధాన పార్టీలు తమిళనాడు ఓటర్లను ఇదే విధంగా మోసగించాయని, ప్రస్తుతం మరో ప్రత్యామ్నాయం వైపు వారు ఎదురు చూస్తున్నారని అన్నారు.

03/27/2016 - 02:44

చెన్నై, మార్చి 26: తమిళనాడులో వచ్చే మే 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి 54 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా, ఇద్దరు రాష్ట్ర ఉపాధ్యక్షులకు చోటు లభించింది. బిజెపి జాతీయ వెబ్‌సైట్‌లో ఉంచిన జాబితా ప్రకారం కారైకుడి మాజీ ఎమ్మెల్యే అయిన రాజా ఈసారి చెన్నైలోని టి.నగర్ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తారు.

03/27/2016 - 02:44

భోపాల్, మార్చి 26: పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడం గాని, కాంగ్రెస్ తదితర పార్టీలతో కూటమిగా ఏర్పడడం గాని జరిగే ప్రసక్తి లేదని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి శనివారం స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టనున్నట్లు వచ్చిన వార్తలను సైతం ఆమె తోసిపుచ్చారు.

03/27/2016 - 02:43

న్యూఢిల్లీ/కొచ్చి, మార్చి 26: హింసాకాండతో అట్టుడుకుతున్న లిబియాలోని జవియా నగరంలో జరిగిన రాకెట్ దాడిలో కేరళకు చెందిన సును సత్యన్ అనే నర్సుతోపాటు ఏడాదిన్నర వయసున్న ఆమె కుమారుడు ప్రణవ్ దుర్మరణం పాలయ్యారు. లిబియా రాజధాని ట్రిపోలీకి 45 కిలోమీటర్ల దూరంలోని జవియాలో శుక్రవారం సాయంత్రం దాదాపు 4 గంటలకు ఈ ఘటన జరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు.

03/27/2016 - 02:41

న్యూఢిల్లీ, మార్చి 26: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న పోలీసులు విద్యార్థులపై జరిపిన లాఠీచార్జి, అరెస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ భవన్ ముందు జెఎన్‌యూ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థులు, అధ్యాపకులపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు.

03/27/2016 - 02:08

న్యూఢిల్లీ, మార్చి 26: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సమావేశాలు ఆంధ్ర, తెలంగాణ భవన్‌లో రెండవరోజు ఘనంగా జరిగాయి. ఈ సమావేశాలలో భాగంగా ప్రముఖ నర్తకీమణి యామినీ కృష్ణమూర్తి, చిత్రకారులు రామారావు, ప్రముఖులు జయరామారావు, రాజా రాధారెడ్డి, విజయసాయి, మెండు చక్రపాణి తదితరులను సమాఖ్య ఘనంగా సన్మానించింది.

03/27/2016 - 07:21

తిన్‌సుకియా, మార్చి 26: అసోంలో బిజెపి గనుక అధికారంలోకి వస్తే రాష్ట్రం శరవేగంగా, సర్వతోముఖంగా అభివృద్ధిచెందేలా చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, తన పోరాటం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌పై కాదని, కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో పెరిగి పోయిన పేదరికం, అవినీతి, విధ్వంసంపైనేనని చెప్పారు.

Pages