S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/19/2016 - 05:34

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇదో పెద్ద దెబ్బ. రాహుల్‌పై దేశద్రోహం అభియోగాల కింద కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన వివాదంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సమావేశమైనందుకు ఈ కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.

02/19/2016 - 05:30

న్యూఢిల్లీ: దేశభక్తి నా రక్తంలో, నా హృదయంలో ఉంది... ఇది మినహా నాలో ఏమీలేదు... ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా ఏమైనా చేసినా, చెప్పినా కఠినంగా శిక్షించాలి... కానీ దేశంలోని విద్యార్థులు, విద్యాసంస్థలు, జెఎన్‌యును అపఖ్యాతిపాలు చేయటం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు.

02/19/2016 - 05:29

సూరజ్‌కుండ్: దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఆవరణలలో ఇకనుంచి ప్రధానమైన ప్రాంతంలో 207 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాలు ఎగురనున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఈ విషయం చెప్పింది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఆవరణలో ఇటీవల వివాదాస్పద దేశ వ్యతిరేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

02/19/2016 - 05:11

భోపాల్: దేశంలోని రైతాంగానికి డిజిటల్ ఇండియా సాంకేతిక ప్రయోజనాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ ప్రకటించారు. డిజిటల్ ఇండియాతో దేశంలో 250 వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ మార్కెట్ కోసం ప్రధాన వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

02/19/2016 - 05:08

న్యూఢిల్లీ/హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ-పెట్రోలియం యూనివర్శిటీ)కి పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం నాడు ఆమోద ముద్ర వేసింది. వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న ఐఐపిఇని తాత్కాలికంగా ఆంధ్రాయూనివర్శిటీ ప్రాంగణంలో నెలకొల్పుతారు.

02/19/2016 - 05:07

న్యూఢిల్లీ: ముంబాయిపై జరిగిన ఉగ్ర దాడికి సూత్రధారి అయిన జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ ట్విట్టర్ ఖాతాను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నిర్వహిస్తున్నట్లు కేంద్ర గూఢచార సంస్థలు గుర్తించాయి.

02/18/2016 - 15:49

పనాజీ: వచ్చే ఏడాది మార్చిలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 సీట్లకూ తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ ఎన్నికల పొత్తుకు సంబంధించి తమకు ఎలాంటి ఆలోచన లేదని ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే జిల్లా స్థాయిలో కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు.

02/18/2016 - 15:48

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ తనకు బెయిల్ మంజూరు చేయాలని గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై కోర్టు తన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు తీహారు జైలుకు బుధవారం తరలించిన సంగతి తెలిసిందే.

02/18/2016 - 15:48

దిల్లీ: జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయ్యకుమార్‌పై దేశద్రోహం కేసును ఎత్తివేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే తమ పార్టీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి విజ్ఞప్తి చేసినట్లు ఆయన గురువారం విలేఖరులకు తెలిపారు.

02/18/2016 - 15:47

దిల్లీ: నగరంలోని పాటియాలా హౌస్ కోర్టు వద్ద కొందరిపై దాడులు జరగడం దురదృష్టకరమని, ఈ ఘటనలో దాడి చేసినట్లు సాక్ష్యాలుంటే సంబంధిత లాయర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది. కోర్టు వద్ద జర్నలిస్టులు, విద్యార్థులపై దాడులకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఓ అధ్యయన బృందాన్ని నియమించినట్లు కౌన్సిల్ చైర్మన్ మీడియాకు తెలిపారు.

Pages