S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/25/2016 - 04:30

న్యూఢిల్లీ, మార్చి 24: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియ గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు గురువారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో హోలీ వేడుకలు జరుపుకొన్నారు. చాలా ఏళ్ల తర్వాత సోనియా గాంధీ హోలీ వేడుకల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. సోనియా, ఆమె కుమారుడు 24, అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో దాదాపు పావు గంట సేపు గడిపారు. పార్టీ మహిళా కార్యకర్తలు ఇరువురు నేతలకు పూలు అందజేశారు.

03/25/2016 - 02:50

న్యూయార్క్, మార్చి 24: టైమ్ మ్యాగజైన్ ఏడాదికోసారి ప్రకటించే ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురయిన వ్యక్తుల జాబితాలో చోటుకోసం పోటీ పడుతున్న వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురయిన వంద మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ వచ్చే నెలలో ‘టైమ్ 100’ పేరిట ప్రకటించనుంది.

03/25/2016 - 02:49

న్యూఢిల్లీ,మార్చ్ 24: ఆరు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తున్నట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాల పాటు తృణమూల్ కాంగ్రెస్‌కు అధికారం కట్టిబెట్టినా మెజారిటీని తగ్గించి మమతా బెనర్జీ పట్ల తమకున్న అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చునని సర్వేలు సూచిస్తున్నాయి.

03/25/2016 - 02:46

శ్రీనగర్, మార్చి 24: కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ రాజకీయ ప్రయాణం తన తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ అడుగుజాడల్లోనే సాగింది. రాజకీయ నైపుణ్యాన్ని, నాయకత్వ పటిమను తండ్రి నుంచి వారసత్వంగా పుణికి పుచ్చుకున్న మెహబూబా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింతగా నిగ్గుదేలారు.

03/25/2016 - 02:46

గౌహతి, మార్చి 24: గత పదిహేను సంవత్సరాలుగా అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాలుగోసారీ పగ్గాలు చేపట్టేందుకు హామీల వర్షం కురిపిస్తోంది. తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వస్తే ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్న బలమైన హామీతో గురువారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.

03/25/2016 - 04:54

శ్రీనగర్, మార్చి 24: జమ్మూ, కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ బాధ్యతలు చేపట్టడానికి రంగం సిద్ధమైంది. గురువారం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యేలు మెహబూబా ముఫ్తీని తమ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకోవడంతో త్వరలోనే జమ్మూ, కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు రంగం సిద్ధమైంది.

03/25/2016 - 01:24

న్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌ను తెలుగు రాష్ట్రాల ఇంచార్జ్ పదవి నుండి తొలగించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరినట్లు తెలిసింది.

03/25/2016 - 04:41

ముంబయి, మార్చి 24: శివసేన అధినేత దివంగత బాల్ థాకరేను హత్య చేయాలని లష్కరే తోయిబా అనుకొందని, అయితే ఆ పని అప్పగించిన వ్యక్తిని పని పూర్తి చేయక ముందే మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారని, అతను వారినుంచి తప్పించుకున్నాడని ముంబయి ఉగ్రవాద దాడులతో సంబంధం ఉందన్న ఆరోపణలపై అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ గురువారం ముంబయి కోర్టుకు చెప్పాడు.

03/24/2016 - 18:02

శ్రీనగర్‌: ఈరోజు జరిగిన కీలక సమావేశంలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) తమ శాసనసభాపక్ష నేతగా మెహబూబా ముఫ్తీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో ముఫ్తీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం ఇక లాంఛనమే. పీడీపీకి మద్దతిచ్చేందుకు భాజపా సుముఖంగానే ఉంది. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ముఫ్తీ చర్చించిన సంగతి తెలిసిందే.

03/24/2016 - 16:33

ముంబయి: నిన్నటి తరం బాలీవుడ్ హీరో శశికపూర్ క్షేమంగా ఇంట్లోనే ఉన్నారని, ఆయనను ఆస్పత్రిలో చేర్పించారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. గురువారం శశికపూర్ ఇంట్లో కుటుంబ సభ్యులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయం ప్రకటించారు. కాగా, నటుడు రిషికపూర్ కూడా ఈ విషయమై వివరణ ఇస్తూ శశికపూర్ క్షేమంగా ఉన్నట్లు ‘ట్వీట్’ చేశారు.

Pages