S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/07/2016 - 16:32

ముంబయి: తెలంగాణ సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం సోమవారం మధ్యాహ్నం ఇక్కడికి చేరుకుంది. ఆయన వెంట ముగ్గురు మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ సలహాదార్లు వచ్చారు. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావును కెసిఆర్ మర్యాద పూర్వకంగా కలిసి రాజ్‌భవన్‌లోనే బసచేస్తారు.

03/07/2016 - 14:01

గాంధీనగర్: జలమార్గం ద్వారా ఉగ్రవాదులు గుజరాత్‌లో ప్రవేశించారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శివరాత్రి సందర్భంగా సోమనాథ్ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అక్కడ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి పెద్దఎత్తున సోదాలు చేస్తున్నారు. ఈ ఆలయం వద్ద ఈరోజు సాయంత్రం నిర్వహించాల్సిన సాంస్కృతిక ఉత్సవాలను భద్రతా కారణాల రీత్యా రద్దు చేశారు.

03/07/2016 - 14:01

దిల్లీ: దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీ నగరంలో సోమవారం ఉదయం నుంచి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. శివరాత్రి పర్వదినం కావడంతో శివాలయాల వద్ద, మార్కెట్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో సిసి టీవీ ఫుటేజీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.

03/07/2016 - 13:59

దిల్లీ: విధ్వంసకాండకు ఉగ్రవాదులు వ్యూహరచన చేస్తున్నారన్న సమాచారం అందడంతో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోసారి హెచ్చరించింది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు విజయవాడ, జైపూర్, భోపాల్, లక్నో, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరించే ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది.

03/07/2016 - 13:57

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ సమీపంలోని కచ్నా గ్రామంలో ఆదివారం ఉదయం చర్చిలో దాడికి పాల్పడ్డవారిలో ఏడుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బజరంగ్‌దళ్‌కు చెందిన వ్యక్తులు దాడి చేసి పలువురిని గాయపరిచారు.

03/07/2016 - 11:51

దిల్లీ: దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఉదయం అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్తంగా తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధావన్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అధిపతి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.

03/07/2016 - 07:28

కరాచి: భారత్‌కు సంబంధించి పాకిస్తాన్ ఆదివారం ఒక సానుకూల చర్య తీసుకుంది. తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ అరెస్టు చేసిన భారతీయ మత్స్యకారుల్లో 87 మంది ఆదివారం విడుదల చేసింది. మరో 86 మంది ఈ నెల చివరలో విడుదల చేయనుంది. గత రెండున్నర సంవత్సరాలుగా ఈ మత్స్యకారులు పాకిస్తాన్‌లోని లాంధీ జైలులో మగ్గుతున్నారు.

03/07/2016 - 06:59

చెన్నై:నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, మిమిక్రీ కళాకారుడు ‘కళాభవన్’ మణి కన్నుమూశారు. ఆయ న వయస్సు 45 సంవత్సరాలు. ‘జెమిని’ చిత్రంలో విలన్‌గా వినూత్నరీతిలో నటిం చి తెలుగువారికి పరిచయమైన మణి తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఆటోడ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించి, అదే పాత్రతో సినిమాల్లోకి అరంగేట్రం చేసి జాతీయస్థాయి నటుడిగా ఎదిగిన మణి బహుముఖ ప్రజ్ఞాశాలి.

03/07/2016 - 06:41

జైపూర్: ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాలో ఒక 30 ఏళ్ల మహిళను ఆమె సోదరుడు, ఇతర సమీప బంధువులు సజీవ దహనం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె తొలిసారి తన కుటుంబ సభ్యులను చూడడానికి వచ్చినప్పుడు ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు.

03/07/2016 - 06:40

కోల్‌కతా: పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడిన అఫ్జల్ గురును 2013లో ఉరితీసిన తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ గంగూలీ ఆదివారం అనుమానాలు వ్యక్తం చేస్తూ, మెడకు ఉరితాడు బిగుసుకునే చివరిక్షణం వరకు కూడా మానవ హక్కులదే పైచేయి కావాలన్నారు. ‘ఉరి అమలు తీరు తప్పని ఒక మాజీ న్యాయమూర్తిగా నేను చెప్పగలను. అతని క్షమాభిక్ష పిటిషన్‌ను ఫిబ్రవరి 3న తిరస్కరించారు. ఫిబ్రవరి 9న ఉరిని అమలు చేశారు.

Pages