S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/23/2016 - 04:27

న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకమార్ బుధవారం హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల స్నేహితులతో భేటీ అవుతారు. అనంతరం రోహిత్ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. కన్హయ్యకుమార్ కోసం హైదరాబాద్ హెచ్‌సియులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.

03/22/2016 - 17:56

కోచి: మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ను కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు బిజెపి వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు దిల్లీ నుంచి బిజెపి నేత ఒకరు ఫోన్‌లో శ్రీశాంత్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై బుధవారం తన నిర్ణయం ప్రకటిస్తానని శ్రీశాంత్ చెప్పినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఆయనపై బిసిసిఐ జీవితకాలం నిషేధం విధించిన సంగతి తెలిసింది.

03/22/2016 - 16:47

రాయ్‌పూర్: ఇన్‌ఫార్లర్లుగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరిస్తున్నారని ఆగ్రహించి ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు అతి కిరాతకంగా చంపిన సంఘటన సుకుమా జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది. పోలంపల్లి సమీపంలో పొలం నుంచి వస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని మావోలు కత్తులతో పొడిచి చంపారు. రోకెల్ గ్రామంలో మరో వ్యక్తిని అతని కుటుంబ సభ్యుల ఎదుటే నరికి చంపారు.

03/22/2016 - 13:12

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితుడైన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. మరో అయిదుగురు విద్యార్థి నేతలతో కన్నయ్య రాహుల్ ఇంటికి రావడం చర్చనీయాంశమైంది. బిజెపిని ఎదుర్కొనేందుకు కన్నయ్య లాంటి విద్యార్థి నేతల సహాయం తీసుకోవాలని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం.

03/22/2016 - 11:57

దిల్లీ: పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. జమ్ము-కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై వీరు చర్చిస్తున్నారని తెలిసింది. ఈ విషయమై ఈరోజు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

03/22/2016 - 06:08

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటం మొదలు పెట్టింది కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. సోమవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వామపక్ష నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది కాంగ్రెస్సేనని అన్నారు. 1984లో ఏపిలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ తమ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిందని ఎద్దేవా చేశారు.

03/22/2016 - 05:24

సికింద్రాబాద్, మార్చి 21: స్వైన్‌ఫ్లూ మహమ్మారి చాపక్రింద నీరులా విస్తరిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను తోడేస్తూనే ఉంది. వ్యాధితో తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పలగూడకు చెందిన సుమన్ (23) వారం రోజుల క్రితం మహవీర్ ఆసుపత్రిలో చేరి వ్యాధి నిర్థారణలో స్వైన్‌ఫ్లూ బయటపడడంతో ఈనెల 17న గాంధీ ఆసుపత్రికి తరలించారు.

03/22/2016 - 05:06

న్యూఢిల్లీ/ కొచ్చి, మార్చి 21: కేరళలో ఎన్నికల నియమావళి అమలులో ఉండగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 20 లక్షల కుటుంబాలకు ఏప్రిల్ ఒకటో తేదీనుంచి ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన మార్చి 4నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది.

03/22/2016 - 05:05

న్యూఢిల్లీ, మార్చి 21: దేశద్రోహ అభియోగాలు ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను భగత్‌సింగ్‌తో పోల్చడం ద్వారా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ వివాదానికి తెరలేపారు. శశి థరూర్ వ్యాఖ్యలపై బిజెపి సోమవారం మండిపడింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ థరూర్ వ్యాఖ్యలతో ఏకీభవించకుండా దూరం పాటించింది.

03/22/2016 - 05:04

షిల్లాంగ్, మార్చి 21: హింసాకాండను విడనాడితే ఈశాన్య భారత మిలిటెంట్ల గ్రూపులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడానికి ముందుకు వస్తుందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఆయుధాలు వీడే ఏ గ్రూపుతోనైనా కేంద్రం శాంతి చర్చలు జరుగుతుందని పేర్కొన్న ఆయన, హింసాకాండను చర్చాబాట పెట్టాలని తీవ్రవాదులకు విజ్ఞప్తి చేశారు.

Pages