S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/22/2016 - 01:59

న్యూఢిల్లీ: దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఎవ్వరూ లాగేసుకోలేదని, అది వారి హక్కు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఢిల్లీలో సోమవారం భారత నిర్మాత బిఆర్ అంబేద్కర్ 6వ స్మారకోపన్యాస కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ, దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లను మార్చటం లేదా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

03/21/2016 - 16:47

గాంధీనగర్: గుజరాత్ హైకోర్టులో ఓ న్యాయవాది నిప్పుపెట్టుకుని ఆత్మాహుతికి యత్నించాడు. ఆత్మాహుతికి కారణాలు తెలియరాలేదు. గాయాలపాలైన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

03/21/2016 - 16:44

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభానికి ముందు అమితాబ్ బచ్చన్ జాతీయగీతం పాడటంపై కేసు నమోదు అయింది. నిర్ణీత సమయానికన్నా ఎక్కువసేపు గీతాన్ని ఆలపించారంటూ ఉల్లాస్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు.

03/21/2016 - 16:35

న్యూఢిల్లీ : భారత్ మాతాకీ జై నినాదంపై రచ్చ చేయడం మంచిది కాదని, ఎవరైనా స్లోగన్‌ ఇవ్వవచ్చునని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత మాతా కీ జై నినాదంపై ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఆ నినాదం బీజేపీ సొంతం కాదని, అది ప్రజల నినాదమని అన్నారు.

03/21/2016 - 15:01

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు లేవనెత్తే అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవద్దని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి మంత్రానే్న అజెండాగా చేసుకుని ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి కార్యకర్తలకు ఆదివారం పిలుపునిచ్చారు.

03/21/2016 - 07:01

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. అధికార పార్టీకి చెందిన 9మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష బిజెపి పక్షాన చేరడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ క్రమంలో పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు అనర్హులుగా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ గోవింద్‌సింగ్ కుంజ్వాల్ తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు.

03/21/2016 - 07:00

న్యూఢిల్లీ: గత 12 ఏళ్లలో విదేశాల్లో వైద్య డిగ్రీ పొంది తిరిగివచ్చిన భారతీయ విద్యార్థుల్లో సగటున 77 శాతం మంది ఇక్కడ డాక్టర్‌గా రిజిస్టర్ కావడానికి భారతీయ వైద్య మండలి (ఎంసిఐ) నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో పాస్ కాలేక పోతున్నారు.

03/21/2016 - 06:59

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి బిజెపి, దాని ధనబలమే కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలోని అధికార పార్టీతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ అసలు స్వరూపం బట్టబయలైందని ఆయన ఆరోపించారు. భావోద్వేగాలను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని రాహుల్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

03/21/2016 - 06:58

శ్రీనగర్: జమ్మూ-కాశ్మీరులోని కార్గిల్‌లో హిమపాతం సంభవించడంతో గల్లంతైన కె.విజయ్ కుమార్ అనే సిపాయి ఆచూకీ కనుగొనేందుకు మూడు రోజుల నుంచి గాలింపు జరుపుతున్న సైనిక బృందాలు ఆదివారం ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మంచు కింద 12 అడుగుల లోతున కూరుకుపోయిన విజయ్ కుమార్ మృతదేహాన్ని సహాయ బృందాలు వెలికితీశాయని శ్రీనగర్‌లో రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

03/21/2016 - 06:57

న్యూఢిల్లీ: ‘్భరత్ మాతాకీ జై’ అని అనడం ఒక వ్యక్తి దేశభక్తికి నిదర్శనం అని బిజెపి చేస్తున్న వాదనను కాంగ్రెస్ పార్టీ ఆదివారం తప్పుబడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌లాంటి వారిని ఆ పార్టీ ఏ విధంగా పరిగణిస్తుందో చెప్పాలని ప్రశ్నించింది. ‘నేతాజీ జైహింద్ అన్నారు, భగత్ సింగ్, ఇంక్విలాబ్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అని అన్నారు.

Pages