S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/21/2016 - 06:56

శ్రీనగర్: జమ్మూ, కాశ్మీర్‌లో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నెలకొన్న ప్రతిష్టంభనపై అపోహలను తొలగించడానికి పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ త్వరలోనే తమ పార్టీ సీనియర్ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

03/21/2016 - 02:35

న్యూఢిల్లీ: ఉత్తరాది నుండి దక్షిణాది గ్రిడ్ విద్యుత్ సరఫరా లైన్ల పనులు ఏడు నెలల్లో పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ దత్తాత్రేయతో ఆదివారం సాయంత్రం సమావేశం అయ్యారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య జరిగిన విద్యుత్ అంశంతో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించమన్నారు.

03/21/2016 - 02:01

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది ప్రాజెక్టులను ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) మొదటి దశలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పిఎంకెఎస్‌వై పథకంపై ఆదివారం ఢిల్లీలో జరిగిన కేంద్ర జలవనరుల శాఖ సమన్వయ కమిటీ భేటీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను విలేఖరులకు తెలిపారు.

03/20/2016 - 17:05

జమ్ముకశ్మీర్‌ : జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలకు హిమపాతం ముప్పు పొంచి ఉందని స్నో అండ్‌ అవలాంచీ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌(ఎస్‌ఏఎస్‌ఈ) ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. మరో 48 గంటల పాటు హిమపాతం, మంచు చరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. కుప్వారా, బారాముల్లా, బందిపొరా, కార్గిల్‌, గండర్‌బల్‌ జిల్లాలకు రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఎస్‌ఏఎస్‌ఈ మీడియం ప్రమాద హెచ్చరికలు పంపింది.

03/20/2016 - 07:15

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తొలి రోజు శనివారం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రసంగంలో జాతీయ వాదంపై చెలరేగుతున్న వివాదమే ప్రధానాంశంగా నిలిచింది. దేశంపై విమర్శలను తమ పార్టీ సహించబోదని ఆయన స్పష్టం చేస్తూ దేశ వ్యతిరేక నినాదాలు చేయడానికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక సాకు కారాదని అన్నారు.

03/20/2016 - 07:05

న్యూఢిల్లీ, మార్చి 19: రైతులు సాధికారులై గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం పరివర్తన చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజులపాటు జరిగే వ్యవసాయభివృద్ది మేళాను శనివారం ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ వ్యవసాయ విధానాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఎంతో ఉన్నదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించుకోవాలని పిలుపు ఇచ్చారు.

03/20/2016 - 07:05

న్యూఢిల్లీ, మార్చి 19: జెఎన్‌యు క్యాంపస్‌లో అనుమతి లేకుండా మనుస్మృతి ప్రతులను దగ్ధం చేసిన సంఘటనపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ వర్శిటీ ప్రోక్టర్ అయిదుగురు విద్యార్థులకు నోటీసులు జారీ చేశారు.

03/20/2016 - 07:03

న్యూఢిల్లీ, మార్చి 19: దేశద్రోహం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన జెఎన్‌యు విద్యార్థి ఉమర్ ఖలీద్ జరిగిన సంఘటనపై ఏమాత్రం విచారం వ్యక్తం చేయలేదు. తిహార్ జైలునుంచి విడుదలైన తరువాత మాట్లాడుతూ ‘జైలుకు వెళ్లినందుకు నేనేమీ చింతించడం లేదు. గర్విస్తున్నాను’ అని ప్రకటించాడు. ‘మాపై బనాయించిన ఈ కేసులో జైలుకెళ్లినందుకు మేం ఏమీ బాధపడడం లేదు.

03/20/2016 - 07:02

లతేహార్ (జార్ఖండ్), మార్చి 19: ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు పశువుల వ్యాపారుల మృతి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది మతఘర్షణలు దారితీసే ప్రమాదం ఉండడంతో నిషేధాజ్ఞలు విధించారు. లతేహార్ జిల్లాలోని జాబ్బర్‌లోని ఓ చెట్టుకు రెండు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో జనం రోడ్లపైకి వచ్చి రాకపోకలను దిగ్బంధనం చేశారు.

03/20/2016 - 07:00

ఆగ్రా, మార్చి 19: నగరంలోని కీంద్రీయ హిందీ విద్యా సంస్థ(సిహెచ్‌ఐ)లో ‘బీఫ్ పార్టీ’ జరిగినట్లుగా చూపించే ఫోటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం హిందుత్వ వాద గ్రూపులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడానికి దారి తీసింది. దీంతో అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించారు.

Pages