S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/23/2016 - 06:14

న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కారును ముప్పుతిప్పలు పెట్టేందుకు విపక్షాలు వివాదాస్పద ఆయుధాలతో సన్నద్ధమవుతున్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. అయితే, దేశ భక్తి నినాదంతో విపక్షాలను ఎదురు దెబ్బ తీసేందుకు అధికారపక్షం ప్రతి వ్యూహం పన్నుతోంది.

02/22/2016 - 18:27

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గౌరవ డాక్టరేట్‌ను సున్నితంగా తిరస్కరించారు. తనకు ఈ విశ్వవిద్యాలయం ఎన్నో ఇచ్చిందని, వాటి ముందు డాక్టరేట్ తక్కువేనన్నారు. డాక్టరేట్‌ను తిరస్కరిస్తున్నందుకు వర్సీటీ అధ్యాపకులు తనను క్షమించాలని ఆయన కోరారు. గతంలోనూ మోదీ అమెరికాలో పర్యటించినపుడు లూసియానా వర్శిటీలో డాక్టరేట్‌ను తిరస్కరించారు.

02/22/2016 - 18:27

దిల్లీ: జాట్ కులస్థులకు రిజర్వేషన్లను కల్పించే అంశంపై చర్చించేందుకు ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో సోమవారం ఇక్కడ భేటీ అయింది. రిజర్వేషన్లు కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై కమిటీ సమావేశంలో చర్చించారు.

02/22/2016 - 17:37

చండీగఢ్: రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న జాట్ కులస్థులు సోమవారం కూడా పలు చోట్ల విధ్వంసకాండ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రోహ్తక్ జిల్లాలో పరిస్థితి దిగజారింది. సోమవారం ఆందోళనకారులు ఓ గూడ్సురైలులో నాలుగు బోగీలకు, ఓ న్యాయమూర్తి కారుకు నిప్పు పెట్టారు. అనేక ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించడంతో అక్కడికి చేరుకునేందుకు భద్రతాదళాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

02/22/2016 - 17:37

శ్రీనగర్: ఇక్కడి పాంపోర్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులకు సోమవారం సాయంత్రం తెరపడింది. సైనికులు కాల్పులను విరమించినప్పటికీ, ప్రభుత్వ భవనంలో ఇంకా ఉగ్రవాదులెవరైనా ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. సైనికులు ఆదివారం నాడు ఓ ఉగ్రవాదిని హతమార్చిన సంగతి తెలిసిందే.

02/22/2016 - 16:08

దిల్లీ: బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయన సోమవారం ఇక్కడ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. 25న రైల్వే బడ్జెట్, 29న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్నట్లు ఆయన ప్రకటించారు.

02/22/2016 - 16:09

దిల్లీ: విద్యార్థుల ఆందోళనలతో ఇక్కడి జెఎన్‌యులో నెలకొన్న వివాదాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యలో సోమవారం ఇక్కడ అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, జెఎన్‌యు వివాదంపై రాజకీయ పార్టీల్లో భిన్నవైఖరులున్నాయని అన్నారు.

02/22/2016 - 16:05

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితులైన అయిదుగురు విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం సమయానికి కూడా ఇక్కడి జెఎన్‌యు క్యాంపస్‌లోనే ఉన్నారు. తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, పోలీసులే వచ్చి అరెస్టు చేసుకోవచ్చని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. క్యాంపస్‌లోకి వెళ్లేందుకు తమకు వైస్ చాన్సలర్ నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి లేనందున పోలీసులు జెఎన్‌యు బయటే ఉన్నారు.

02/22/2016 - 14:09

దిల్లీ: హర్యానాలో జాట్ కులస్థుల ఆందోళనల ఫలితంగా దిల్లీ నగరానికి నీటి సరఫరా నిలిచిపోవడంపై సుప్రీం కోర్టు స్పందించింది. నీటి సరఫరా పునరుద్ధరణకు తగు ఆదేశాలివ్వాలంటూ దిల్లీ సిఎం కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించడంతో కేంద్రంతోపాటు హర్యానా సర్కారుకు న్యాయస్థానం నోటీసులిచ్చింది. ఈ విషయమై రెండురోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

02/22/2016 - 11:57

దిల్లీ: ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దేశద్రోహం కేసులో నిందితులుగా ఉంటూ ఇన్నాళ్లూ కనిపించకుండా పోయిన ఐదుగురు విద్యార్థులు గత అర్ధరాత్రి క్యాంపస్‌లో ప్రత్యక్షం కావటంతో వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

Pages