S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/19/2016 - 12:01

రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని తైమర్ ఘాటీ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లపై తొలుత మావోయిస్టులు కాల్పులు జరపగా, తర్వాత జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.

02/19/2016 - 07:39

పాట్నా/వదోదర/చెన్నై : ఢిల్లీ జెఎన్‌యు వ్యవహారం దేశవ్యాప్తంగా అట్టుడుకుతోంది. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్టుకు నిరసనగా, అనుకూలంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. కొన్ని నగరాలకే పరిమితమైన నిరసన కార్యక్రమాలు గురువారం మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో కన్హయ్య కుమార్‌కు మద్దతుగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

02/19/2016 - 07:34

న్యూఢిల్లీ: తిహార్ జైలులో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశద్రోహం అభియోగాల కింద అరెస్టయి, జుడీషియల్ కస్టడీలో ఉన్న కన్హయ్య కుమార్ తనకు బెయిలు మంజూరు చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ఈ బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తుంది.

02/19/2016 - 07:30

న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయిన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ ఎస్‌ఎఆర్ గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పాటియాలా కోర్టులో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసు స్టేషన్‌లోనే న్యాయమూర్తి ఎదుట గిలానీని హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన విచారణ నిమిత్తం పాటియాలా కోర్టునుంచి న్యాయమూర్తి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాణక్యపురి పోలీసుస్టేషన్‌కు వచ్చారు.

02/19/2016 - 07:29

న్యూఢిల్లీ: పాటియాలా హౌస్ కోర్టులో జర్నలిస్టులు, జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడి కేసులో సమన్లు జారీ అయిన ముగ్గురు న్యాయవాదుల్లో ఏ ఒక్కరు కూడా గురువారం పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు. కోర్టు ఆవరణలో ఈ నెల 15న కొంతమంది న్యాయవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

02/19/2016 - 07:28

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనను కొనసాగించడంపై యథాతథ స్థితిని కొనసాగించాలని బుధవారం జారీ చేసిన ఉత్తర్వును ఎత్తివేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. మాజీ స్పీకర్ నబమ్ రెబియా 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడానికి సంబంధించి న్యాయపరమైన, అసెంబ్లీ రికార్డులను పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఈ అనుమతి ఇచ్చింది.

02/19/2016 - 07:27

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన 68వ పుట్టిన రోజయిన ఈ నెల 24నుంచి చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాలో సీనియర్ సిటిజన్లకు (అరవై ఏళ్లకు పైబడిన వృద్ధులు) ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 2011లో పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిందని గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటిస్తూ జయలలిత చెప్పుకొన్నారు.

02/19/2016 - 07:26

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడికి సంబంధించి మన దేశం అదజేసిన సాక్ష్యాధారాలను పాక్ కొట్టిపారేయడాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీవ్రంగా తప్పుబడుతూ, ఈ వ్యవహారంలో పాక్ మొద్దు నిద్రను నటిస్తోందని, దర్యాప్తు విషయంలో దానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.

02/19/2016 - 05:34

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇదో పెద్ద దెబ్బ. రాహుల్‌పై దేశద్రోహం అభియోగాల కింద కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన వివాదంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సమావేశమైనందుకు ఈ కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.

02/19/2016 - 05:30

న్యూఢిల్లీ: దేశభక్తి నా రక్తంలో, నా హృదయంలో ఉంది... ఇది మినహా నాలో ఏమీలేదు... ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా ఏమైనా చేసినా, చెప్పినా కఠినంగా శిక్షించాలి... కానీ దేశంలోని విద్యార్థులు, విద్యాసంస్థలు, జెఎన్‌యును అపఖ్యాతిపాలు చేయటం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు.

Pages