S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/15/2016 - 01:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: సియాచిన్‌లో మంచు తుపాను కారణంగా చనిపోయిన తొమ్మిది మంది సైనికుల మృత దేహాలను వాతావరణం అనుకూలించిన పక్షంలో సోమవారం ఢిల్లీకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అయితే ప్రమాదం జరిగిన కార్‌డుంగ్‌లా వద్ద వాతావరణం ఇప్పటికీ అనుకూలంగా లేదని, అయినప్పటికీ తొమ్మిది మంది సైనికుల మృత దేహాలను లేహ్‌కు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

02/15/2016 - 01:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ మృతికి సంబంధించి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌ను మరోసారి ప్రశ్నించిందని, అవసరమైతే ఆయనను మరోసారి కూడా పిలిపిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ చెప్పారు.

02/15/2016 - 01:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన లష్కరే తోయిబా ఉగ్రవాది, పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీకి సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అమెరికాలో ఉంటున్న అతని భార్య, వ్యాపార భాగస్వామి నిరాకరించినట్లు తెలుస్తోంది.

02/15/2016 - 01:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాలకు లోనైనప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా, బలంగా నిలబడిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకు కారణం తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలన్నీ భారతదేశ వౌలిక విధానాలను శ్లాఘిస్తున్నాయని ప్రధాని తెలిపారు.

02/15/2016 - 00:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఢిల్లీలోని గోల్ మార్కెట్‌లో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయ బోర్డు మీద ‘పాకిస్తాన్ ఆఫీసు’ అని నల్లటి ఆయిల్‌తో రాసారు. ఆ సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కార్యాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

02/15/2016 - 00:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన విజయవంతమైందని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి చెప్పారు. ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో చేరే ఉద్దేశం తెరాసకు లేదని, ఎన్‌డిఎలో చేరుతామన్నా వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.

02/15/2016 - 00:11

ముంబయి, ఫిబ్రవరి 14: రాజకీయ, సినీ ప్రముఖులు హాజరైన ‘మేక్ ఇన్ ఇండియా’ సాంస్కృతిక కార్యక్రమంలో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ముంబయిలోని నదీతీరంలో ఉన్న గిర్‌గౌమ్ చౌపాటి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, సినీ నటులు అమితాబ్, హేమమాలిని, అమీర్ ఖాన్ ప్రభృతులు హాజరయ్యారు.

02/15/2016 - 00:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పార్లమెంటు దాడి కుట్ర కేసులో ఉరితీయబడిన అఫ్జల్ గురు సంస్మరణార్థం సభలు పెడుతున్న జెఎన్‌యు విద్యార్థులకు లష్యరే తయ్యబా అధినేత అఫీజ్ సరుూద్ మద్దతు ఉందంటూ హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అలహాబాద్‌లో చేసిన ప్రకటన అత్యంత వివాదాస్పదమైంది. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం అలహాబాద్‌లో మాట్లాడుతూ జెఎన్‌యు విద్యార్థులకు హఫీజ్ సరుూద్ మద్దతు ఉన్నదని ప్రకటించారు.

02/14/2016 - 20:59

ముంబై:ముంబైలో జరుగుతున్న మేకిన్ ఇండియా వారోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల వేదికవద్ద అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అక్కడే ఉన్న పలువురు ప్రముఖులు తృటిలో ప్రమాదంనుంచి బయటపడ్డారు. వేదికను మంటలు చుట్టుముట్టగానే భద్రతాసిబ్బంది వారిని అక్కడినుంచి తరలించారు.

02/14/2016 - 20:58

ముంబై:ముంబైలో నిన్న ప్రారంభమైన మేకిన్ ఇండియా వారోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల వేదికవద్ద పెను అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వేదికపై బిగ్ బి అమితాబ్ ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. అయితే సకాలంలో ఆయన వేదికనుంచి సురక్షితంగా బయటపడటంతో అపాయం తప్పింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Pages