S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/03/2016 - 07:06

న్యూఢిల్లీ, ఫిబ్రవరి,2: జాతియ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేస్తున్న తెలుగురాష్ట్రాలకు అవార్డుల పంట పండింది. వివిధ విభాగాల్లో తెలంగాణా ఐదు, ఆంధ్రప్రదేశ్ ఐదు అవార్డులు దక్కించుకున్నాయి.

02/03/2016 - 07:00

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్, డెంటల్ కాలేజీ మేనేజిమెంట్ల సంఘం బి కేటగిరీ సీట్ల భర్తీకి ఉద్దేశించి ఏపి అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ వృత్తి విద్యా సంస్ధల నిబంధనల విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది.

02/03/2016 - 06:50

న్యూఢిల్లీ, జనవరి 2: ప్రపంచ దేశాలను మరో వైరస్ గడగడలాడిస్తోంది. దోమకాటు కారణంగా వ్యాపించే జికా వైరస్ దాదాపు అన్ని దేశాల్లోనూ హాహాకారాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. ఈ వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్డ్ ఎమర్జెన్సీని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

02/03/2016 - 06:48

కోజీకోడ్, ఫిబ్రవరి 2: ఆయుర్వేదం వంటి భారతీయ సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రజలకు నాణ్యమైన, సరసమైన వైద్యం అందించడంతో ప్రపంచంలోనే భారత్ ముందుందని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు.

02/03/2016 - 06:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశంలో ఈ ఏడాది శీతాకాలం గతంలో ఎన్నడూ లేనంత వేడిగా ఉంది. నవంబర్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎంతో అధికంగా నమోదవుతుండటంతో కేవలం ఉత్తర భారతావనిలోనే కాకుండా దేశమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

02/03/2016 - 06:43

బెంగళూరు, ఫిబ్రవరి 2: ఈ నెల 20 తర్వాత ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును ఆమోదించేలా చూడడానికి ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు మంగళవారం చెప్పారు.

02/03/2016 - 06:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజి)కి మరిన్ని నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 2016 ఏప్రిల్ నెల నుండి ఈ పథకం కింద చెల్లింపులకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్ వెల్లడించారు.

02/03/2016 - 06:42

ముంబయి, ఫిబ్రవరి 2: మహిళలకు ఆలయం ప్రవేశం కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతు ప్రకటించిన ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ దేవుడు లింగ వివక్ష చూపించడని అన్నారు. అహ్మద్‌నగర్‌లోని శనిశింగ్నాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడంపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దేవుడికి లింగ వివక్ష ఉండదని, ప్రార్థనలు చేయకుండా ఎవరినీ ఆపకూడదని పవార్ అన్నారు.

02/03/2016 - 06:39

జమ్మూ, ఫిబ్రవరి 2: జమ్మూ-కాశ్మీరులో రాజకీయ అనిశ్చితి మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై తమ వైఖరిని వివరించేందుకు గవర్నర్ ఎన్‌ఎన్.వోరాతో మంగళవారం విడివిడిగా సమావేశమైన పిడిపి, బిజెపి నేతలు ఈ విషయంలో పరస్పరం వేలెత్తి చూపుకుంటుండటమే ఇందుకు కారణం.

02/03/2016 - 04:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కరాచీలో శుక్రవారం ప్రారంభమయ్యే ఓ సాహితీ సదస్సులో పాల్గొనడానికి బాలీవుడ్ నటుడు, బిజెపి సానుభూతిపరుడు అనుపమ్ ఖేర్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం వీసా నిరాకరించింది. అయితే అనుపమ్ ఖేర్ వీసాకోసం అసలు దరఖాస్తే చేయలేదని న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయం చెప్పడం గమనార్హం.

Pages