S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/20/2016 - 16:45

ఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. రోహిత్ మృతి ఘటనపై ఆమె వివరణ ఇస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. వాస్తవాలు తెలుసుకోకుండా దళిత, దళితేతర మధ్య వివాదంగా కొంతమంది విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు.

01/20/2016 - 16:43

ఢిల్లీ : ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ పోలీసు అధికారి కారు చోరీకి గురైంది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగంలో ఐజీగా పనిచేస్తున్న ఆనంద్ స్వరూప్ కారును దుండగులు అపహరించారు. ఇటీవల పఠాన్‌కోట దాడిలో ఉగ్రవాదులు పోలీసు కారును అపహరించి దాడికి పాల్పడిన విషయం విదితమే.

01/20/2016 - 16:42

ఢిల్లీ :ఢిల్లీ సెల్ ప్రత్యేక పోలీసులు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతోసంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. గణతంత్ర వేడుకలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

01/20/2016 - 13:36

ఢిల్లీ‌‌: పీఎస్‌ఎల్వీసీ- సీ31ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రదాని నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

01/20/2016 - 13:31

ఢిల్లీ‌: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకి ఉత్తరప్రదేశ్‌ పోలీసులు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్‌షా ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. అయితే.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రకటించారు.

01/20/2016 - 11:44

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామ జిల్లా నయినాబాద్‌పురి ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులు ఓ ఇంట్లో చొరబడి దాక్కున్నట్లు పోలీసులు పసిగట్టారు. ఉభయ పక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.

01/20/2016 - 11:41

నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం సరిగ్గా 9.31 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-31 (పిఎస్‌ఎల్‌వి) వాహక నౌకను ఇస్రో శాస్తవ్రేత్తలు నింగిలోకి విజయవంతంగా పంపారు. ఈ ఏడాది ఇస్రో సాధించిన ఘన విజయం ఇది అని శాస్తవ్రేత్తలు అభివర్ణించారు.

01/20/2016 - 07:45

జెరూసలెం, జనవరి 19: భారత ఆర్థిక వ్యవస్థతో అవధుల్లేని దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇజ్రాయెల్ వ్యాపార, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఉంటున్న భారతీయ సంతతిని ఉద్దేశించి మాట్లాడిన సుష్మా స్వరాజ్ దేశీయ భద్రత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటికే ఇరు దేశాల సంబంధాలు పరిమితం కాకూడదని స్పష్టం చేశారు.

01/20/2016 - 07:43

పుణె/గాంధీనగర్, జనవరి 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఓ దళిత పరిశోధకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పుణె, గాంధీనగర్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అలజడి రేకెత్తించింది. ఆందోళనకారులను ఈ ఆత్మహత్యను సంస్థాగత హత్యగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

01/20/2016 - 07:41

కోక్రాజార్ (అసోం), జనవరి 19: గత పదిహేను సంవత్సరాలుగా అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రచార కార్యక్రమానికి మంగళవారం నాడిక్కడ శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ అనేక కీలక ప్రకటనలు చేశారు.

Pages