S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/31/2015 - 07:13

ఇండోర్, డిసెంబర్ 30: మూగ, చెవిటి అమ్మాయి గీతను తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్తాన్‌లో ప్రవేశించిన గీతను అక్టోబర్ 26న భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాక్‌లోనే ఓ స్వచ్ఛంద సంస్థ వద్ద ఆశ్రయం పొందిన ఆమెను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది.

12/31/2015 - 07:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: కేంద్ర ఆర్థిక మంత్రి, ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) మాజీ అధ్యక్షుడు అరుణ్ జైట్లీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం కూడా తన దాడిని కొనసాగించింది. ఒక బ్యాంకుకు చెందిన ప్రైవేట్ క్రికెట్ క్లబ్‌కు సంబంధం ఉన్న అంశంలో దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా 2011లో జైట్లీ డిడిసిఎ చైర్మన్ హోదాలో అప్పటి ఢిల్లీ పోలీసు కమిషనర్‌పై ఒత్తిడి చేశారని ఆప్ ఆరోపించింది.

12/31/2015 - 07:10

ముంబయి, డిసెంబర్ 30: భూ ఉపరితలంపైనుంచి గగనతల లక్ష్యాలను ఛేదించగల బరాక్-8 క్షిపణిని నౌకాదళం బుధవారం ఇక్కడ ఐఎన్‌ఎస్ కలకత్తా నౌకపైనుంచి విజయవంతంగా పరీక్షించింది. దీంతో సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి వ్యవస్థను నౌకాదళంలో చేర్చడానికి రంగం సిద్ధమైంది. భారత నౌకాదళం, డిఆర్‌డిఎల్, ఇజ్రాయెల్‌కు చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేసాయి.

12/31/2015 - 07:10

బులంద్‌షహర్ (ఉత్తరప్రదేశ్), డిసెంబర్ 30: అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు కాని, మందిరం నిర్మాణంపై సంబంధిత పక్షాల మధ్య పరస్పరం అవగాహన కుదిరేవరకు కాని వేచిచూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అందువల్లే మందిరం నిర్మాణం ఆలస్యం అవుతోందని ఆయన చెప్పారు.

12/31/2015 - 07:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: బిహార్ అంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా పని చేయని మంత్రులను తొలగించడంతో పాటుగా తన ప్రభుత్వం ఇమేజిని పెంచడం కోసం తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారు. అయితే సమర్థులైన వారు లభించకపోవడమే ఆయనకు సమస్యగా ఉన్నట్లు తెలుస్తోంది.

12/31/2015 - 06:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని బుధవారం సమీక్షించారు. ముఖ్యంగా రహదారులు, రైల్వేలు, మెట్రో రైలు, విద్యుత్, ఫుడ్ ప్రొసెసింగ్ రంగాల్లో చేపడుతున్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఎలాంటి జాప్యానికీ ఆస్కారం ఉండకూడదన్నారు.

12/31/2015 - 06:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం నివేదిక పరిశీలించి జనవరి తొలివారంలో కరవు సాయం అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు. కేంద్రంలోని ఐదు మంత్రిత్వ శాఖల అధికారులు కరవు నివేదికలను అధ్యయనం చేస్తున్నారని అన్నారు. అయితే, ఆంధ్రకు అందించే ఆర్థిక సాయం విషయం తరువాత తెలియజేస్తానన్నారు.

12/31/2015 - 05:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: భారత సైన్యానికి చెందిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతోంది. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల పేరిట మాజీ సైనికులకు వల వేయడం ద్వారా భారత సైన్యం రహస్య సమాచారం కూపీ లాగేందుకు ప్రయత్నిస్తోంది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.. రక్షణ శాఖను అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది.

12/31/2015 - 05:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: విశాఖపట్నం విమానాశ్రయం దగ్గర ఉన్న భారత ఎయిర్‌పోర్ట్ అథారిటీకి చెందిన భూమికి బదులు విశాఖ పోర్ట్ ట్రస్‌కు చెందిన భూమిని తీసుకునేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు.

12/30/2015 - 18:51

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ను బుధవారం ఐసీయూకు తరలించారు. సయీద్ కు ఆక్సిజన్ థెరఫీ అవసరమని, వైద్య నిపుణుల బృందం ఆయన పరిస్థితిని సమీక్షిస్తోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. 79 ఏళ్ల సయీద్ స్పృహలో ఉన్నారని వైద్యులు చెప్పారు.

Pages