S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/14/2016 - 11:47

దిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. పొగ మంచు దట్టంగా కురియడంతో సుమారు 90 రైళ్లను రద్దు చేశారు. చలిగాలికి తట్టుకోలేక రాజస్థాన్‌లో ఇద్దరు వృద్ధులు మరణించారు. విమాన సర్వీసులు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి.

01/14/2016 - 07:34

న్యూఢిల్లీ, జనవరి 13: పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో ఢాకాలోని ఆ దేశ బలగాలు భారత్ బలగాలకు లొంగిపోవడానికి సంప్రదింపులు జరిపిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జె.ఎఫ్.ఆర్.జాకబ్ (92) కన్నుమూశారు. చాలారోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న జాకబ్ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

01/14/2016 - 07:30

న్యూఢిల్లీ, జనవరి 13: గతంలో అనేకసార్లు శాంతిప్రక్రియ ముందుకు సాగకుండా పోవడానికి పాకిస్తాన్ సైన్యమే కారణమని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బుధవారం ఆరోపించారు. భారత్‌తో చర్చల విషయంలో పాకిస్తాన్ సైన్యం ప్రధాని నవాజ్ షరీఫ్‌తో విభేదిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సుహాగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘పాక్ సైన్యం ఈ పని చాలాసార్లు చేసింది..

01/14/2016 - 07:25

న్యూఢిల్లీ, జనవరి 13: దేశంలోని అన్ని మతస్థుల్లోకెల్లా ముస్లిం మతస్థుల్లోనే యువత ఎక్కువగా ఉంది. భారత్‌లోని ముస్లింల జనాభాలో 47 శాతం మంది 20 ఏళ్లలోపువారే. హిందూ మతంలో పిల్లలు, టీనేజర్ల సంఖ్య 40 శాతం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జైనుల్లో 19 ఏళ్ల వయసు వరకు గల వారు కేవలం 29 శాతం మంది మాత్రమే ఉన్నారు. క్రైస్తవుల్లో 37 శాతం, సిక్కుల్లో 35 శాతం, బౌద్ధ మతస్థుల్లో 37 శాతం ఉన్నారు.

01/14/2016 - 07:24

అలీగఢ్, జనవరి 13: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2017లో జరుగనున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఆత్రౌలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సంగీతా చౌదరికి ఇచ్చిన టికెట్‌ను బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి రద్దు చేశారు. సంగీతా చౌదరి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారనే అభియోగంపై ఆమెకు ఇచ్చిన టికెట్‌ను రద్దు చేశారు.

01/14/2016 - 07:22

న్యూఢిల్లీ, జనవరి 13: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి ఎయిర్‌బేస్ వెలుపల నిలిచివున్న వాహనంలో చైనీస్ వైర్‌లెస్‌సెట్‌ను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొదటి నుంచీ అనుమానాలు రేకెత్తిస్తున్న పంజాబ్ పోలీసు అధికారి సల్వీందర్‌సింగ్‌ను బుధవారం మూడో రోజూ ప్రశ్నించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఎయిర్‌బేస్ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపడుతోంది.

01/14/2016 - 07:22

శ్రీనగర్, జనవరి 13: జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన పిడిపి, బిజెపిల మధ్య నెలకొన్న అస్పష్టతే ఇందుకు కారణమవుతోంది. ఇందుకు సంబంధించి తొలి అడుగు వేయాల్సింది పిడిపినేనని బిజెపి స్పష్టం చేయడం.. ఆ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఇప్పటివరకూ నోరు మెదపకపోవడంతో అసలు ఏమి జరుగుతోందో.. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అంతుబట్టకుండా ఉంది.

01/14/2016 - 07:21

న్యూఢిల్లీ, జనవరి 13: తమిళనాడులో జల్లికట్టు నిర్వహణకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇటీవల కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

01/14/2016 - 06:34

న్యూఢిల్లీ, జనవరి 13: తెలంగాణకు కరవు సాయం గురువారం ప్రకటించనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి హరీశ్‌రావుకు హామీ ఇచ్చారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, తాను, ఇతర మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ గురువారం మధ్యాహ్నం సమావేశం కానున్నట్టు మంత్రి వెల్లడించారు.

01/14/2016 - 06:20

న్యూఢిల్లీ, జనవరి 13: పంటలకు మెరుగైన బీమా సౌకర్యం కల్పించటంతోపాటు రైతు ప్రయోజనాల పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన కొత్త బీమా పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పంటల బీమా పథకం 2016 ఖరీఫ్ నుంచి అమల్లోకిరానుంది.

Pages