S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/13/2016 - 07:22

న్యూఢిల్లీ, జనవరి 12: జోజిల్లా పాస్ సొరంగం నిర్మాణం కాంట్రాక్ట్‌ను తన సన్నిహితులకు చెందిన ఐఆర్‌బి సంస్థకు ఇప్పించిన కేంద్ర రోడ్లు, భవనాలు, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీపై దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు.

01/13/2016 - 07:21

న్యూఢిల్లీ, జనవరి 12: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడి కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ) బృందాలు జమ్మూ రీజియన్‌లో గత ఏడాది ఇదేవిధమైన దాడులు జరిగిన సాంబా, కథువా ప్రాంతాలను మంగళవారం సందర్శించాయి.

01/13/2016 - 07:20

చెన్నై, జనవరి 12: తమిళనాడులో జల్లికట్టును అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో జల్లికట్టు నిర్వహణకు వీలుగా ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసారు.

01/13/2016 - 07:19

బిజ్నోర్, జనవరి 12: కోడళ్లను వేధించే అత్తల ఆరళ్ల గురించి, మితిమీరిన పెత్తనం గురించి కథలు కథలుగా వింటాం. కానీ, అత్తలను అత్యంత అమానుషంగా చూసే, వేధించే కోడళ్లూ ఉంటారన్నది ఎంతైనా వాస్తవం. ఇందుకు యూపిలోని బిజ్నోర్‌లో వెలుగుచూసిన ఓ ఉదంతమే నిదర్శనం. 70 ఏళ్ల తన అత్తను ఓ కోడలు విచక్షణారహితంగా కొట్టింది. అంతేకాదు, ఓ బట్టతో ఆమె మెడను నులిపేసేందుకు ప్రయత్నించింది.

01/13/2016 - 06:42

న్యూఢిల్లీ, జనవరి 12:తెలంగాణలోని నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఫిబ్రవరి పదమూడో తేదీ జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. తెలంగాణాతోపాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాలలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉపఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జనవరి 20న జారీ చేస్తారు.

01/13/2016 - 06:14

న్యూఢిల్లీ/ చెన్నై, జనవరి 12: తమిళనాడులో పొంగల్ (సంక్రాంతి) పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు (ఎడ్ల పందేల) క్రీడపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది.

01/13/2016 - 06:11

ఖాట్మండు, జనవరి 12: ఇటీవల నేపాల్‌లో సంభవించిన పెను భూకంప తాకిడికి ఇటు హిమాలయాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. 60 సెంటీమీటర్ల మేర కుంగిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉపగ్రహ టెక్నాలజీ ఆధారంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తులో ఎంత మార్పు వచ్చిందన్న విషయాన్ని నిర్థారించారు. భూకంపం సంభవించిన మొదటి కొన్ని సెకన్లలోనే అత్యున్నతమైన హిమ శిఖరాలు కుంగాయని వెల్లడించారు.

01/12/2016 - 17:54

ఛత్తీస్‌గడ్‌ : భారత్‌లో యువ శక్తి అధికంగా ఉందని, ప్రోత్సహిస్తే యువతదేన్నైనా సాధిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ యువజనోత్సవంలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రస్తుతం జాతిని నిలబెట్టేందుకు యువత శ్రమిస్తోందని చెప్పారు.

01/12/2016 - 17:53

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన 178 మంది మత్య్సకారులను విడుదల చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. తమ జలాల్లోకి ప్రవేశించారని బంగ్లాదేశ్‌ అధికారులు వీరిని రెండు నెలల క్రితం అరెస్టు చేశారు. బగెర్‌హత్‌ జైలులో ఉన్న మత్స్యకారులను ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో విడుదల చేసినట్లు సంబంధిత శాఖ సహాయ మంత్రి ప్రకటించారు.

01/12/2016 - 17:52

చెన్నై : జల్లికట్టుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని తమిళనాడు సీఎం జయలలిత లేఖ రాశారు. ఆర్డినెన్స్‌ ద్వారా జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు.

Pages