S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/26/2015 - 03:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: జనన మరణ ధ్రువీకరణ పత్రాలు సహా ప్రభుత్వ సేవలకు సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించే ప్రక్రియను సరళతరం చేశారు. ఎక్కువ పేజీలతో కూడుకున్నదిగా కాకుండా ఒకే పేజీలో ఈ రకమైన వివరాలన్నీ పొందుపర్చేందుకు వీలుగా ఓ ఫార్మాట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు.

12/25/2015 - 22:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: అఫ్గానిస్థాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్‌లో ఆగాలని శుక్రవారం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం భారత్,పాకిస్తాన్‌ల మధ్య ఇప్పటివరకు సాగిన అధికారిక ప్రోటోకాల్ సంబంధాల్లో నూతన ఒరడిని సృష్టించిందని బిజెపి ప్రశంసిస్తూ, దీనికి అటల్ బిహారీ వాజపేయి జన్మదినం కన్నా మెరుగయిన రోజు మరోటి ఉండదని పేర్కొంది. డిసెంబర్ 25 మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినం కావడం విశేషం.

12/25/2015 - 17:01

ముంబయి: రెండు దశాబ్దాల పాటు హీరోయిన్‌గా ఉర్రూతలూగించిన అలనాటి బాలీవుడ్ నటి సాధన (74) అనారోగ్యంతో బాధ పడుతూ శుక్రవారం ఇక్కడ కన్నుమూశారు. ఆమె నటించిన పలు సినిమాలు కాసులవర్షం కురిపించాయి. 1941లో ఆమె పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆమె కుటుంబం ముంబయిలో స్థిరపడింది. ‘శ్రీ 420’తో సినీరంగ ప్రవేశం చేశాక ఆమె పలువురు అగ్రహీరోలతో పోటాపోటీగా నటించి అభిమానుల ప్రశంసలు అందుకున్నారు.

12/25/2015 - 11:37

దిల్లీ: మాజీ ప్రధాని, భారతరత్న ఎ.బి.వాజపేయి 91వ జన్మదినం సందర్భంగా ఆయనకు బిజెపి నేతలు, ఇతర ప్రముఖులు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా వాజపేయి ఇంటికి వెళ్లి పలకరించారు. వాజపేయి పూర్వికుల గ్రామమైన జబేశ్వర్‌కు రైల్వేశాఖ సేవలను ప్రారంభించింది. ఆగ్రానుంచి ప్రత్యేక రైలును జబేశ్వర్ గ్రామానికి నడుపుతున్నారు.

12/25/2015 - 07:39

క్రీస్తు జననం విశ్వానికే ఆనందం. శాంతిదూత ఉద్భవించిన రోజున ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల ప్రజలు పండుగ చేసుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలను శోభాయమానంగా అలంకరించారు. శాంతి సందేశాలు, శాంతాక్లాజ్‌ల పలకరింపులతో ప్రార్థనా మందిరాల్లో సందడి నెలకొంది.
====================
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు -ఎడిటర్

12/25/2015 - 07:02

ప్రధాని మోదీని నిలదీసిన కాంగ్రెస్

12/25/2015 - 06:12

షీనా బోరా హత్యపై ఎయిమ్స్ బృందం నివేదిక

12/25/2015 - 06:10

అదే అత్యంత ముఖ్యమైన ఆయుధం
ఎస్‌ఎస్‌బికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ పిలుపు

12/25/2015 - 05:54

అసలైన అభివృద్ధికి నిదర్శనం
మోదీ విధానాలను కొనియాడిన జావడేకర్

12/25/2015 - 05:54

పార్టీనుంచి సస్పెన్షన్‌కు కారణాలు చెప్పాలి * బిజెపి ఎంపీ కీర్తి ఆజాద్

Pages