S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/25/2015 - 05:53

జోషీ నివాసంలో అద్వానీ ప్రభృతుల భేటీ * కీర్తి ఆజాద్ సస్పెన్షన్‌పై చర్చ

12/25/2015 - 05:52

మోదీని నిలదీసిన రాహుల్

12/25/2015 - 05:07

భారతీయ విద్యార్థులకు జరిగిన పరాభవంపై అమెరికా

12/24/2015 - 15:08

దిల్లీ: బిజెపి నేత, మాజీ కేంద్రమంత్రి మురళీమనోహర్ జోషీ ఇంట్లో గురువారం ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. పార్టీ నుంచి ఎంపీ కీర్తి ఆజాద్ సస్పెన్షన్, కేంద్ర మంత్రి జైట్లీపై ఆరోపణలు, పార్లమెంటు సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్తిస్తున్నట్లు సమాచారం. పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ తదితరులు పాల్గొన్నారు.

12/24/2015 - 11:52

ఢిల్లీ:రైలు ప్రయాణీకుల నుంచి తత్కాల్ టిక్కెట్లకు అదనపు రుసుమును వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మార్పు ఈనెల 25 నుంచి అమల్లోకి వస్తుంది. సెకెండ్ క్లాస్ సీట్లకు తప్ప స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలకు అదనపు ఛార్జీలు వసూలుచేస్తారు.

12/24/2015 - 21:16

భారత జాతీయ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలకు ఈ ఏడాది వేదికగా నిలిచింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన నరేంద్ర మోదీ సారథ్యంలోని బిజెపికి ఈ ఏడాదికి పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో చుక్కెదురైంది. బిహార్, ఢిల్లీ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు కేరళ, గుజరాత్‌లలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా బిజెపి కంగుతింది.

12/24/2015 - 07:29

90వ దశకం తొలి నాళ్లలో ముంబయిలో మారణకాండ సృష్టించిన గొలుసు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడైన చోటా రాజన్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. మారుపేరుతో తిరుగుతున్న రాజన్ ఇండోనేషియాలోని ఎయిర్‌పోర్ట్‌లో పొరపాటున అసలు పేరు చెప్పి దొరికిపోయాడు. గత కొన్ని సంవత్సరాలుగా రాజన్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేసింది.

12/24/2015 - 07:28

భారతదేశ పాత్రికేయ వృత్తిని కొత్త మలుపు తిప్పి పదునైన వ్యాఖ్యలతో చురుకైన గీతలతో రాజకీయ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆర్.కె.లక్ష్మణ్ తన 94వ ఏట తుది శ్వాస విడిచారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆయన సృష్టించిన కామన్ మ్యాన్ వ్యంగ్యచిత్రం దశాబ్దాలపాటు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది.

12/24/2015 - 07:26

భారతదేశ అణు పితామహుడిగా ఎనలేని సేవలందించి రాష్టప్రతిగా కూడా సమున్నత విలువలు పాదుకొల్పిన అబ్దుల్ కలాం జూలై 27న తుది శ్వాస విడిచారు. తన ఆలోచనలతోనూ, తన జీవన విధానంతోనూ ఇటు యువతనూ, అటు అన్ని తరగతుల వారినీ విశేషంగా ప్రభావితం చేసిన కలాం మరణాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. భారతదేశ 11వ రాష్టప్రతిగా ఆయన పనిచేసిన కాలం చరిత్రలో తిరుగులేనిదిగా నిలిచిపోయింది.

12/24/2015 - 07:24

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రెండు జాతీయ రాజకీయ పార్టీలకు విఘాతకరంగా పరిణమించడమే కాకుండా అతి స్వల్ప వ్యవధిలోనే కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ విజయదుందుభి మోగించింది. 2014లోనే స్వల్ప వ్యవధితోపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో 67 సీట్లను గెలుచుకుని ప్రాంతీయ పార్టీలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

Pages