S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/08/2016 - 13:45

న్యూఢిల్లీ :తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసును సుప్రీం కోర్టు శుక్రవారంనాడు విచారణకు స్వీకరించింది. ఈ కేసును హైకోర్టు కొట్టివేయటంతో కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం విదితమే. ఈ కేసు ఫిబ్రవరి 2నుంచి విచారణ జరగనున్నది.

01/08/2016 - 13:43

ముంబయి : ముంబయిలోని బాలీవుడ్‌కు చెందిన 40మంది సెలబ్రీటీల భద్రతను కుదిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకున్నది. ప్రముఖ బాలీవుడ్ నటులు షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్‌ల భద్రతను కుదించారు. అసహనంపై బాలీవుడ్ నటులు స్పందించిన సంగతి తెలిసిందే.

01/08/2016 - 13:43

హైదరాబాద్ : నగరంలోని రామాంతపూర్ ఇందిరానగర్‌వాసి అయిన శివకిరణ్ అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ ఐఐటిలో చదివిన శివకిరణ్ ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. సరైన ర్యాంక్ రాకపోవటంతో మనస్తాపంతో హాస్టల్ గదిలో ఉరేసుకుని మృతిచెందాడు. శివకిరణ్ మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

01/08/2016 - 11:54

చెన్నై: తిరునల్వేలి జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది మరణించారు. పుదుచ్చేరి నుంచి కేరళ వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదానికి లోనైంది. నిద్రమత్తులో డ్రైవర్ బస్సు నడపటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

01/08/2016 - 11:53

చండీగఢ్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సాయుధ బలగాలు శుక్రవారం ఉదయం మళ్ళీ గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు చొరబడిన తర్వాత ఇక్కడ అయిదురోజుల పాటు ఎదురుకాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. గాలింపు చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించాక మళ్లీ సైనికులు రంగప్రవేశం చేశారు.

01/08/2016 - 11:51

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ సి.ఎం. ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మరణించటంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత ఏడాది జరిగిన కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, పిడిపి కూటమి విజయం సాధించడంతో ముఫ్తీ సి.ఎం.గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

01/08/2016 - 07:43

న్యూఢిల్లీ, జనవరి 7: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున అతన్ని ముంబయిలోని ప్రత్యేక మోకా కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచడం సాధ్యం కాదని ఢిల్లీలోని ప్రత్యేక సిబిఐ న్యాయస్థానం తెలిపింది.

01/08/2016 - 07:42

న్యూఢిల్లీ, జనవరి 7: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై దాడి చేసిన ఉగ్రవాదులకు మార్గనిర్దేశనం చేసిన నలుగు పాక్ ఉగ్రవాదులను భారత్ గుర్తించింది. జైషే మహ్మద్ అధినేత వౌలానా మసూద్ అజర్, ఆయన సోదరుడు అబ్దుర్ రవూఫ్ అజ్గర్‌తో సహా మొత్తం నలుగురు ఈ దాడికి సూత్రధారులని ఇంటెలిజెన్స్ విభాగం నిర్ధారించింది. వీరిలో అజ్జర్‌కు 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసి-814 హైజాక్‌తో సంబంధం ఉంది.

01/08/2016 - 07:41

గుర్‌దాస్‌పూర్, జనవరి 7: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రవాద దాడిపై విచారణ జరుపుతున్న దర్యాప్తు బృందాలు ఎస్‌పి సల్వీందర్ సింగ్ వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించాయి. ఎయిర్‌బేస్ దాడికి ముందు ఉగ్రవాదులు తనను నిర్బంధించారని సింగ్ చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలోనూ విచారణ మొదలెట్టారు. గురుదాస్‌పూర్ ఎస్పీని ఉగ్రవాదులు ఎక్కడ నిర్బంధించారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

01/08/2016 - 07:41

గాంధీనగర్, జనవరి 7: దేశంలో వైద్యం రంగం ఇప్పటికీ అంటు వ్యాధులు, ఇతర వ్యాధులు, జీవన శైలి వల్ల వచ్చే వ్యాధులను అదుపు చేయడమనే సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా చెప్పారు. ‘ఆరోగ్య రంగంలో మనం కచ్చితమైన పురోగతి సాధించాం.

Pages