S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/07/2016 - 17:34

త్రిపుర : బస్సు లోయలోపడి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. బుధవారం అర్థరాత్రి బెలోనియ వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలోపడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులలో ఆరుగురు మృతిచెందగా, 20మందికి గాయాలయ్యాయి.

01/07/2016 - 17:33

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై హైకోర్టు స్టే ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నట్లు సనత్‌నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆయన గురవారంనాడు మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తుందని అన్నారు.

01/07/2016 - 14:03

పుణె : ఓ పక్క విద్యార్థులు ఆందోళన చేస్తుండగా.. టీవీ నటుడు, భాజపా నేత గజేంద్ర చౌహాన్‌ పుణెలోని ఎఫ్‌టీఐఐ(ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా ఆయన నియామకాన్ని నిరసిస్తూ విద్యార్థులు 139రోజులుగా ఆందోళన చేపట్టారు.

01/07/2016 - 13:57

ఢిల్లీ : పాలం ఎయిర్ పోర్టులో జమ్మూకాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ మృతదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కాసేపట్లో శ్రీనగర్ కు ముఫ్తీ పార్థీవ దేహాన్ని తరలించనున్నారు. బిజ్ బెహరాలో రేపు ముఫ్తీ అంత్యక్రియలు జరగనున్నాయి.

01/07/2016 - 13:12

ఢిల్లీ : పెండింగ్‌ బిల్లులపై చర్చించాలని సోనియాను కోరినట్లు వెంకయ్య తెలిపారు. సోనియాతో సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ మూడు విషయాలపై ఆమెతో చర్చించానని తెలిపారు. పెండింగ్‌ బిల్లులపై చర్చించాలని, వాటికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

01/07/2016 - 13:10

ఢిల్లీ : పర్యావరణ అనుమతులులేని ప్రాంతాల్లో తవ్వకాలు నిలిపివేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశించింది. పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు ఎలా చేస్తారంటూ ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఎన్‌జీటీ ప్రశ్నించింది. తదుపరి విచారణను పిబ్రవరి 4కు వాయిదా వేసింది.

01/07/2016 - 13:09

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల చేత గురువారం ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మండలిలో 40 మంది ఎమ్మెల్సిలు ఉన్నారని తెలిపారు.

01/07/2016 - 13:08

జమ్మూకాశ్మీర్‌: ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మృతికి నివాళిగా రాష్ట్రంలో వారంరోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. ఈ రోజుల్లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాష్ట్ర జెండాలను అవనతం చేశారు. సీఎం మృతికి సంతాపంగా ఈరోజు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

01/07/2016 - 12:09

దిల్లీ: ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తులైనా వారి మాతృభాషను నేర్చుకోవడానికి రాజ్యాంగం పూర్తి హక్కును కల్పించిందని, అయితే ఇందుకు విరుద్ధంగా కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడం అన్యాయమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ ఆంధ్ర అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులో తెలుగు నేర్చుకోకుండా చేయడం సమంజసం కాదన్నారు.

01/07/2016 - 12:08

దిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు గురువారం ఉదయం సమావేశమయ్యారు. లోక్‌సభలో కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ఆయన సోనియాతో చర్చించినట్లు తెలుస్తోంది.

Pages