S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/07/2016 - 11:43

దిల్లీ: అనారోగ్యంతో కొద్దిరోజులుగా ఇక్కడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత పది రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పై వైద్య చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది మార్చి 1న ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.

01/07/2016 - 06:37

న్యూఢిల్లీ, జనవరి 6: భారత్ పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించే భారీ భూకంపాల బారిన పడనుందా? కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులు భారీ భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని విశ్వసిస్తున్నారా? అని అడిగితే, దీనికి అవుననేదే సమాధానం.

01/07/2016 - 07:29

న్యూఢిల్లీ, జనవరి 6: ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అవమానకరమైన రీతిలో ఓడిపోయినప్పటికీ అమిత్ షాయే తిరిగి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే పార్టీ కార్యవర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. కనీసం ఒక కేబినెట్ మంత్రి సహా కొంతమంది కొత్తవారికి పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. పనితీరు సరిగా లేని జాతీయ కార్యవర్గంలోని కొంత మందిపై వేటు పడవచ్చు.

01/07/2016 - 06:27

చెన్నై, జనవరి 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్ర ప్రజలకు పొంగల్ కానుకను ప్రకటించారు. రేషన్ కార్డులు కలిగివున్న 1.91 కోట్ల మందికి ప్రజా పంపిణీ పథకం కింద కిలోబియ్యం, పంచదార, రెండు చెరకుగడలు అందచేస్తారు. అంతేకాకుండా కార్డుకు వంద రూపాయల నగదు పంపిణీ చేస్తామని అన్నాడిఎంకె అధినేత్రి వెల్లడించారు. ‘బియ్యం కార్డుదారులందరికీ సంక్రాంతి కానుకగా గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉంది.

01/07/2016 - 06:25

న్యూఢిల్లీ, జనవరి 6: ఉగ్రవాదుల నుండి రక్షణ కల్పించటంలో విఫలమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

01/07/2016 - 06:21

గుర్గావ్, జనవరి 6: జనాభాలో మహిళల శాతానికి అనుగుణంగా వారు వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందలేక పోతున్నారనేది వాస్తవమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంగీకరించారు. అయితే దేశ పోలీసు బలగాలలో తగినంత మంది మహిళలకు ఉద్యోగాలు, సరయిన సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను చెప్పినదానికీ, చేసినదానికీ తేడా ఉండదన్నారు.

01/07/2016 - 06:21

ముంబయి, జనవరి 6: అక్రమ ఆయుధాల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు పెద్ద ఊరట లభించింది. ఫిబ్రవరి 27న జైలునుంచి ఆయన విడుదల కానున్నారు. జైలులో సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలా మెలగడంతో సంజయ్ శిక్షను తగ్గించారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులకు కేంద్ర హోం శాఖ ఆమోదం లభించింది. దీంతో ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన గడవుకంటే ముందే విడుదలకు మార్గం సుగమం అయింది.

01/07/2016 - 06:20

న్యూఢిల్లీ, జనవరి 6: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ఈ సంవత్సరాంతంలోపు ప్రారంభం అవుతాయని బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఈ నెల 9న ఇక్కడ జరిగే సదస్సులో ఈ నిర్మాణం పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అయితే ప్రజాఉద్యమం ద్వారా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగదని, కోర్టు తీర్పు వెలువడిన తరువాత మాత్రమే అది జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

01/07/2016 - 05:33

న్యూఢిల్లీ, జనవరి 6: తెలంగాణ రాష్ట్రానికి 30వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ను కోరినట్టు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావాత్ వెల్లడించారు.

01/07/2016 - 04:37

న్యూఢిల్లీ/గురుదాస్‌పూర్, జనవరి 6: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై దాడి చేసిన ఉగ్రవాదులందరినీ ఏరివేశామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో మరి కొందరు తీవ్రవాదులు సైనిక దుస్తుల్లో కనిపించారంటూ వెలుగు చూసిన నిఘా హెచ్చరికలు కలకలం రేపాయి. గురుదాస్‌పూర్‌లోని సైనిక కేంద్రం సమీపంలో ఇద్దరు మిలిటెంట్లు సంచరిస్తున్నట్టుగా హెచ్చరికలు రావడంతో పశ్చిమ సెక్టార్‌లోని అన్ని వైమానిక కేంద్రాలనూ అప్రమత్తం చేశారు.

Pages