S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/01/2020 - 03:44

న్యూఢిల్లీ: స్వతంత్ర, సార్వభౌమ, ప్రజాస్వామిక, సంఘటిత అఫ్గానిస్తాన్‌కు భారత్ మద్దతు ఇస్తుందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రీంగ్లా అఫ్గానిస్తాన్ నాయకత్వానికి తెలియజేశారు. అఫ్గానిస్తాన్‌లో సుస్థిరమయిన శాంతి నెలకొనాలంటే బయటి నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం నిలిచిపోవాలని ఆయన సూచించారు. శ్రీంగ్లా రెండు రోజుల అధికారిక పర్యటన కోసం శుక్రవారం కాబూల్‌కు చేరుకున్నారు.

02/28/2020 - 04:03

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లను అదుపుచేయడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటన్లో 34 మంది మృతి చెందారు. 200 మంది గాయపడ్డారు. హోం మంత్రిగా అమిత్ షా విఫలమయ్యారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది.

02/28/2020 - 01:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశ రాజధాని ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. 34 మంది ప్రాణాలను బలితీసుకున్న సీఏఏ ఉద్యమం బంగారు భవిత మసకబారేలా చేసింది. ‘వెల్‌కమ్ టు ఏ వెరీ హ్యాపీ స్కూల్’ అన్న సగం బోర్డు విధ్వంస తీవ్రతకు సాక్షీభూతంగా నిలిచింది. హ్యాపీ అన్నది ఆవిరైపోయింది. ఈశాన్య ఢిల్లీలోని బ్రిజ్‌పురిలోని ఓ ప్రైవేటు పాఠశాల రూపురేఖలు మారిపోయాయి.

02/28/2020 - 01:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత్ ప్రాణాంతకమయిన కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలిన చైనాలోని వూహాన్ నగరం నుంచి 112 మందిని గురువారం వెనక్కి తీసుకువచ్చింది. అలాగే ఈ వైరస్ సోకిన నౌకలో ప్రయాణిస్తున్న మరో 124 మందిని టోక్యో నుంచి స్వదేశానికి తీసుకొచ్చింది. భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఒక సీ-17 గ్లోబ్‌మాస్టర్ 3 రవాణా విమానం వూహాన్ నగరం నుంచి 76 మంది భారతీయులను, 36 మంది విదేశీయులను భారత్‌కు తీసుకు వచ్చింది.

02/27/2020 - 23:40

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పది లక్షల రూపాయిల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. అలాగే, హింసాకాండలో గాయపడిన వారికి అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయిల సహాయాన్ని అందిస్తామని గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

02/27/2020 - 23:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27:్ఢల్లీ పరిస్థితి నివురుగప్పిన నిప్పుచందంగా ఉంది. గత మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని రీతిలో చోటుచేసుకున్న అల్లర్లలో మృతుల సంఖ్య 34కు చేరింది. ప్రభుత్వం తీసుకున్న అత్యవసర భద్రతా చర్యల వల్ల పరిస్థితి కొంత మేర సద్దుమణిగినట్టు కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు.

02/28/2020 - 03:28

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడిక్కడ మైన్మార్ అధ్యక్షుడు యూ విన్ మియింట్‌తో విస్తృత అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మైన్మార్ సామాజిక-ఆర్థికాభివృద్ధిపై కేంద్రీకృతమయి ఉన్న పది ఒప్పందాలు ఇరు దేశాల మధ్య కుదిరాయి. బుధవారం నాడిక్కడికి చేరుకున్న మైన్మార్ అధ్యక్షుడికి ఇక్కడి రాష్ట్రపతి భవన్‌లో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం లభించింది.

02/27/2020 - 23:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: సొంతవారిని కోల్పోయిన బాధ ఓపక్క.. గాయపడ్డ వారు సజీవంగా బయటకు వస్తారో? లేదోనన్న ఆందోళన మరోవైపు ఈశాన్య ఢిల్లీ వాసులను కన్నీరుమున్నీరు చేస్తోంది. ఇక్కడి జీటీబీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడంతో వాటిని ఎప్పుడు తమకు అప్పగిస్తారో అంటూ గంటల తరబడి సంబంధిత కుటుంబాలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాయి.

02/27/2020 - 23:25

చెన్నై, ఫిబ్రవరి 27: సముద్ర తీర ప్రాంతంలో భద్రతను పెంపొందించడానికి ఉపయోగపడే ఆరో తీరప్రాంత గస్తీ నౌక ‘యార్డ్ 45006 వజ్ర’ను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో గురువారం నాడిక్కడ లాంఛనంగా ప్రారంభించారు.

02/27/2020 - 23:24

బెంగళూరు, ఫిబ్రవరి 27: ప్రస్తుత 17వేల కోట్ల రూపాయిలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2024 సంవత్సరం నాటికి 30వేల కోట్లకు చేరనున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం స్పష్టం చేశారు. అలాగే, 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక వ్యవస్థను కలిగిన మూడు దేశాల్లో ఒకటిగా భారత్ మారబోతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

Pages