S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/19/2015 - 02:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు పటియాలా ట్రయల్ కోర్టుకు హాజరైనప్పుడు ఏమవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కోర్టు అరెస్టుకు ఆదేశించే స్థితిలో అరెస్టుకావాలి తప్ప బెయిల్ పెట్టుకోకూడదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. సోనియా, రాహుల్ అరెస్టయితే రాజకీయంగా లబ్దిపొందుతారని బిజెపి నేతలు ఆందోళన చెందుతున్నారు.

12/19/2015 - 02:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: నిర్భయ కేసులో మైనర్‌కు శిక్ష కొనసాగింపు విషయంలో జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నేరస్థుడు నిర్బంధం నుంచి బయటకు రాకూడదని బాధితురాలి కుటుంబం, బాసటగా నిలిచిన మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు కోర్టువద్ద నిలవలేదు. బాల నేరస్థుడు ఆదివారం బయటకు రావడానికి దారులు తెరుచుకున్నాయి.

12/18/2015 - 16:30

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో పాలిథీన్ వాడకాన్ని నిషేధించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రి వర్గ సమావేశ అనంతరం యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. పాలిథీన్‌పై నిషేధం విధిస్తున్నాం. పాలిథీన్‌తో పాటు దాని సంబంధిత వస్తువులను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.

12/18/2015 - 16:28

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసుతో తాను రేపు పాటియాలా కోర్టుకు హాజరు కానున్నానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. తమకు భారత న్యాయస్థానాలపై నమ్మకముందని, కోర్టు ఆదేశాల మేరకు సహజంగానే తాను వెళ్లి తీరునానని, ఆపై ఏం జరుగుతుందో చూద్దామని కొద్ది సేపటి క్రితం తనను కలిసిన మీడియాతో ఆమె వ్యాఖ్యానించారు.

12/18/2015 - 15:47

న్యూఢిల్లీ : తన కూతురు చనిపోయి మూడేళ్లు అవుతున్న సందర్భంగా బాల నేరస్థుడి విడుదల తాము చూడాలా? ఇదేక్కడి న్యాయం? నేరం చేసిన వాడికి వయస్సుతో సంబంధం లేకుండా శిక్ష పడాల్సిందేనని నిర్భయ తల్లి ఆశా దేవీ డిమాండ్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ బాల నేరస్థుడిని విడుదల చేస్తే అతని ముఖాన్ని సమాజానికి చూపించాలని డిమాండ్ చేశారు.

12/18/2015 - 15:44

ఢిల్లీ: గత మూడు సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం కేసులో జువైనల్ నేరస్తుడి విడుదల నిలుపుదలపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జువైనల్ నేరస్తుడి విడుదలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో జువైనల్ నేరస్తుడు ఈ నెల 20న విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

12/18/2015 - 14:04

ఢిల్లీ:అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ వ్యవహారంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, అన్నాడీఎంకే, జేడీయూ సభ్యులు వాకౌట్‌ చేశారు. గందరగోళంతో సభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా పడింది.

12/18/2015 - 13:25

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఎలాంటి చర్చ జరగకుండా రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఈరోజు మధ్యాహ్నం 2.30గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఉన్న అన్ని పక్షాల నేతలను భేటీకి ఆహ్వానించారు.

12/18/2015 - 08:01

లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపీ పాటిల్ డిమాండ్

12/18/2015 - 08:00

ఎంపీ వినోద్ సూచన

Pages