S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/17/2015 - 06:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని టిడిపి ఎంపీ ఎం శ్రీనివాసరావులోక్‌సభలోప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చేసిన హామీ మేరకు ఒక కొత్త రైల్వే డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోఏర్పాటు చేయవలసి ఉందని ఆయన గుర్తుచేశారు.

12/17/2015 - 06:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించాలని తెలుగుదేశం ఎంపీలు ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం జనవరి మొదటి వారంలో నరేంద్ర మోదీని కలవాలని తెలుగుదేశం ఎంపీలు భావిస్తున్నారు.

12/17/2015 - 06:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు సేకరించిన ప్రాంతంలో నిర్మాణాలు ప్రారంభం కాకపోవటం వల్ల భూమిని ఇచ్చిన కొంతమంది అక్కడే తాత్కాలికంగా ఉంటున్నారని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి జులో వోరమ్ చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో ఆయన ఈ సంగతి చెప్పారు.

12/17/2015 - 05:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోకపోవచ్చంటూఓ వైపు పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరూ శనివారం ఢిల్లీ కోర్టు ఎదుట హాజరవనున్నాన్నారు.

12/17/2015 - 05:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే కొలీజియం విధానాన్ని మరింత పారదర్శకం, జవాబుదారీతో కూడినదిగా చేయడం కోసం బుధవారం పలు సూచనలు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి విధి విధానాల మెమోరాండంను (ఎంఓపి) ఖరారు చేయాలని కేంద్రానికి సూచించింది.

12/17/2015 - 05:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 16:ప్రతిష్టాత్మక జిఎస్‌టి బిల్లుపై ఏర్పడ్డ ప్రతిష్ఠంభనను తొలగించే దిశగా కొత్త మార్గంలో కేంద్రం ముందుకెళుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న దృష్ట్యా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇతర విపక్షాల మద్దతు చూరగొనాలని భావిస్తోంది.

12/16/2015 - 17:08

న్యూఢిల్లీ : రాజ్యసభ గురువారం నాటికి వాయిదా పడింది. అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. సభలో ఇంకా గందరగోళ పరిస్థితి తలెత్తడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.

12/16/2015 - 16:42

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజీల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెట్రోల్‌పై 30పైసలు, డీజీల్‌పై 1-17 పైసలు పెంచింది. వాస్తవానికి పెట్రో ధరలు నిన్ననే తగ్గించారు.

12/16/2015 - 16:42

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కనె్నర్ర చేసింది. నగరంలో లగ్జరీ డీజిల్ కార్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2005కు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలను నగరంలోకి అనుమతించరాదని పేర్కొంది. ఢిల్లీలోకి ప్రవేశించే ట్రక్కుల గ్రీన్‌ట్యాక్స్‌ను రెట్టింపు చేశారు.

12/16/2015 - 16:41

న్యూఢిల్లీ : ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని విధించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. రాజ్యసభలో ఎక్సైజ్ సుంకం పెంపుపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఐ నాయకుడు రాజా మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వం ధరలను నియంత్రిస్తున్నామంటూనే ఎక్సైజ్ సుంకాన్ని పెంచటాన్ని తప్పుపట్టారు.

Pages