S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/17/2015 - 05:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే కొలీజియం విధానాన్ని మరింత పారదర్శకం, జవాబుదారీతో కూడినదిగా చేయడం కోసం బుధవారం పలు సూచనలు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి విధి విధానాల మెమోరాండంను (ఎంఓపి) ఖరారు చేయాలని కేంద్రానికి సూచించింది.

12/17/2015 - 05:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 16:ప్రతిష్టాత్మక జిఎస్‌టి బిల్లుపై ఏర్పడ్డ ప్రతిష్ఠంభనను తొలగించే దిశగా కొత్త మార్గంలో కేంద్రం ముందుకెళుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న దృష్ట్యా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇతర విపక్షాల మద్దతు చూరగొనాలని భావిస్తోంది.

12/16/2015 - 17:08

న్యూఢిల్లీ : రాజ్యసభ గురువారం నాటికి వాయిదా పడింది. అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. సభలో ఇంకా గందరగోళ పరిస్థితి తలెత్తడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.

12/16/2015 - 16:42

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజీల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెట్రోల్‌పై 30పైసలు, డీజీల్‌పై 1-17 పైసలు పెంచింది. వాస్తవానికి పెట్రో ధరలు నిన్ననే తగ్గించారు.

12/16/2015 - 16:42

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కనె్నర్ర చేసింది. నగరంలో లగ్జరీ డీజిల్ కార్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2005కు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలను నగరంలోకి అనుమతించరాదని పేర్కొంది. ఢిల్లీలోకి ప్రవేశించే ట్రక్కుల గ్రీన్‌ట్యాక్స్‌ను రెట్టింపు చేశారు.

12/16/2015 - 16:41

న్యూఢిల్లీ : ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని విధించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. రాజ్యసభలో ఎక్సైజ్ సుంకం పెంపుపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఐ నాయకుడు రాజా మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వం ధరలను నియంత్రిస్తున్నామంటూనే ఎక్సైజ్ సుంకాన్ని పెంచటాన్ని తప్పుపట్టారు.

12/16/2015 - 16:40

హైదరాబాద్ : వరదలతో అతలాకుతలమైన తమిళనాడుకు ఐటి దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, కాగ్నజెంట్ ఆర్థికసాయాన్ని ప్రకటించాయి. ఇన్ఫోసిస్ రూ.10కోట్లు, కాగ్నిజెంట్ రూ.6.50 కోట్లు సాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాయి.

12/16/2015 - 16:40

ఒడిశా : ఒడిశాలోని పశ్చిమకచ్చాలో ఆల్‌ఖైదా ఉగ్రవాదిగా అనుమానిస్తూ అబ్దుల్ రహమాన్ (37) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజులుగా నిఘాపెట్టిన అధికారులు అతను చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా అరెస్టు చేశారు.

12/16/2015 - 16:39

న్యూఢిల్లీ : అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మన్మోహన్‌సింగ్ ఇతర నేతలతో కలిసి రాష్టప్రతి భవన్‌కు ర్యాలీగా వెళ్లారు. అనంతరం రాష్టప్రతిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించినట్లు సోనియా వెల్లడించారు.

12/16/2015 - 14:19

న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ వ్యవహారంపై లోక్‌సభ సమావేశంనుంచి కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆందోళన చేస్తున్నారు. నిన్న కూడా ఇదే అంశంపై వారు ఆందోళన చేశారు.

Pages