S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/16/2015 - 14:18

ఢిల్లీ : కరవు సహాయక చర్యలు చేపట్టడంలో సుప్రీం కోర్టు కేంద్రం సహా 11 రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరవు బాధితులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలపై వివరణ కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, 11 రాష్ట్రాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

12/16/2015 - 14:04

హైదరాబాద్‌: కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోటస్ పాండ్ లో బుధవారం వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఎమ్మెల్యేలతో కలసి జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు.

12/16/2015 - 13:46

బెంగళూరు : బెంగళూరు మహా నగర పాలక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. 198 వార్డులకు ఎన్నికలు జరగగా.. బీజేపీ 100, కాంగ్రెస్ 76, జేడీ(ఎస్) 14, ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు. 2011 ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 66 స్థానాల్లో గెలుపొందింది. ఈ సందర్భంగా ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

12/16/2015 - 13:29

న్యూఢిల్లీ : నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో శిక్షను అనుభవిస్తున్న బాల నేరస్థుడి కస్టడీ పొడగించాలని బీజేపీ ఎంపీ హేమా మాలిని కోరారు. లోకసభలో ఇవాళ ఆమె మాట్లాడుతూ బాల నేరస్థుడి మైండ్ కలుషితమైందని, ఒక వేళ ఆ బాల నేరస్థుడిని వదిలేస్తే మళ్లీ అదే తప్పుకు పాల్పడుతాడని, క్రూర ఆలోచనలతో ఉన్న యువకులకు ఇదో గుణపాఠం అవుతుందని ఆమె అన్నారు.

12/16/2015 - 13:22

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్‌పై సీబీఐ దాడులు చేసినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. 2007, 2013లో రాజేంద్ర కుమార్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించినట్లు ఆయనచెప్పారు. లోకసభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆఫీసులో సీబీఐ సోదాలు చేయలేదని చెప్పారు.

12/16/2015 - 13:09

న్యూఢిల్లీ: భారతదేశంలోని మూడు లక్షల గ్రామాల్లో మహిళలకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. భారతదేశ పర్యటనలో ఉన్న ఆయన మీడియా, డెవలపర్లు, పారిశ్రామికవేత్తలు, మార్కెటింగ్ నిపుణులతో ఢిల్లీలో సమావేశమయ్యారు.

12/16/2015 - 11:48

దిల్లీ: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ఇద్దరు ఉగ్రవాదులను దిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరు జిహాదీ సంస్థకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. ఈ అరెస్టుల నేపథ్యంలో దిల్లీ, యు.పి. తదితర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.

12/16/2015 - 07:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఢిల్లీ సచివాలయంపై మంగళవారం సిబిఐ సోదాలు చేయడం పట్ల అటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సోదాల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తముందని కేజ్రివాల్ ఆరోపిస్తూ ఆయన ఒక పిరికిపంద, సైకో అని మండిపడ్డారు.

12/16/2015 - 07:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు తాము ఎన్నికల్లో చేసిన వ్యయానికి సంబంధించిన లెక్కలు చూపడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్టవేసి, స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం క్లిష్టంగా మారిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీమ్ జైదీ అన్నారు. ఎన్నికల్లో ధనమే ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

12/16/2015 - 07:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: లోక్‌సభలో నెలకొంటున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమేనని స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు ఏదో ఒక అంశాన్ని లేవదీసి ప్రధాన మంత్రి, ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పార్లమెంటును స్తంభింపజేయడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Pages