S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/15/2015 - 11:38

దిల్లీ: దిల్లీ సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయాలపై సిబిఐ జరిపిన దాడుల్లో తమ ప్రమేయం లేదని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సిబిఐ పై తాము ఆధిపత్యం చెలాయించాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఏం జరిగినా ప్రధాని మోదీని విమర్శించడం సరికాదని అన్నారు.

12/15/2015 - 11:36

పాట్నా: బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల మంగళవారం ఉదయం సుమారు 10 సెకన్లపాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బీహార్‌లోని గయ, జుమాయి, జార్ఖండ్‌లోని ధన్‌బాద్, తదితర ప్రాంతాల్లో భూమి కంపించటంతో జనం ఇళ్ళల్లోంచి బయటకు పరుగులు తీశారు.

12/15/2015 - 11:35

దిల్లీ: దిల్లీ సచివాలయంలో మంగళవారం ఉదయం సిబిఐ అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన ముఖ్య కార్యదర్శి ఛాంబర్‌లో కూడా సోదాలు జరిగాయి. రాజకీయ కక్షతోనే ప్రధాని మోదీ సిబిఐ దాడులు జరిగేలా ఆదేశించారని దిల్లీ సి.ఎం. కేజ్రీవాల్ ఆరోపించారు.

12/15/2015 - 11:35

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

12/15/2015 - 04:30

త్రిచూర్, డిసెంబర్ 14: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో బిజెపి అధికారంలోకి రాగలదన్న ధీమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్, సిపిఎం సారథ్యాల్లోని రెండు ఫ్రంట్‌ల ఆధిపత్యాన్ని బిజెపి అధిగమిస్తుందని, ప్రస్తుతం చాలా బలమైన శక్తిగా మూడో స్థానంలో ఉందని మోదీ తెలిపారు. ఈ మూడో శక్తిని శివుని మూడో కన్నుతో పోల్చారు.

12/15/2015 - 03:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించటానికి తెరాస ప్రభుత్వం తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బిజెపి, టిడిపిలు ఆరోపించాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమినర్‌ను కలిసి ఫిర్యాదు చేశాయ. సోమవారం రెండు పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల కమిషనర్‌తో సమావేశమై తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు.

12/15/2015 - 03:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారత్, పాకిస్తాన్ మధ్య తాజాగా మొదలైన శాంతి చర్చలు పరస్పర విశ్వాస ప్రాతిపదికగానే ముందుకు సాగుతాయని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. పాకిస్తాన్‌తో మళ్లీ చర్చలు ప్రారంభించాలన్న నిర్ణయాన్ని అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీసుకోవడం జరిగిందని ఆమె వెల్లడించారు.

12/15/2015 - 04:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్నుల బిల్లు (జిఎస్‌టి)పై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలిగే అవకాశం కనిపించటం లేదు. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే జిఎస్‌టి బిల్లును ఆమోదింపచేసుకునేందుకు ఎన్డీయే సర్కార్ తాజాగా చేపట్టిన ప్రయత్నం విఫలమైంది.

12/14/2015 - 18:22

న్యూఢిల్లీ : రాజ్యసభలోని పార్టీ సభ్యులకు భారతీయ జనతా పార్టీ విప్ జారీ చేసింది. వస్తు-సేవల పన్ను బిల్లు సభలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున నాలుగు రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకావాలని విప్ జారీ చేసింది.

12/14/2015 - 18:21

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో అపశ్రుతి చోటుచేసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్థం చేస్తుండగా మంటలు చెలరేగి కార్యకర్తలకు మంటలు అంటుకున్నాయి.

Pages