S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/05/2015 - 05:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెయిల్ రద్దు చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. 2002 హిట్ అండ్ రన్ కేసులో ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాంబే హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ ఎఫ్‌ఎంఐ కాలీఫుల్లా, జస్టిస్ అమితారాయ్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

12/05/2015 - 05:06

సిక్కు అల్లర్ల కేసులో సిబిఐకి కోర్టు ఆదేశం

12/05/2015 - 05:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: జలప్రళయానికి గురైన చెన్నైలో సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్‌డిఆర్‌ఎఫ్ సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని చేరుకోవడం కోసం సామాజిక మాధ్యమాన్ని, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటోంది. అంతేకాదు బాధితులకు సాయం అందేలా చూడడం కోసం న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక డెస్క్‌ను సైతం ఏర్పాటు చేసింది.

12/05/2015 - 05:05

రంగంలోకి మరో 20 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు
10వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

12/05/2015 - 05:05

అనేకచోట్ల సరఫరాలు మృగ్యం
మంత్రులపై బాధిత ప్రజల ఆగ్రహం
పాక్షికంగా బస్సు, రైలు సర్వీసుల పునరుద్ధరణ
325కు పెరిగిన మృతులు
ఇంకా నీటి లోతుల్లోనే వందలాది ప్రాంతాలు

12/05/2015 - 05:03

1029 రూపాయల కోసం ‘కలాం’కు బిఎస్‌ఎన్‌ఎల్ నోటీసు
రికవరీ అధికారి అత్యుత్సాహం

12/05/2015 - 04:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: తెలంగాణలో పనిచేస్తున్న ఆశావర్కర్ల వేతనాలను పెంచవలసిందిగా టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డాకు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీతో పాటు ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కవిత, ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి తదితరులు మంత్రి జెడ్డాతో సమావేశమయ్యారు.

12/04/2015 - 16:16

చెన్నై : చెన్నైలో మళ్లీ వర్షం కురుస్తుండటంతో బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉదయం వరకు తెరిపిచ్చిన వర్షం మధ్యాహ్నాం నుంచి మళ్లీ కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. కాగా ఈ వర్షాలు గతంలో కురిసిన వర్షాలు వలే ఉండవని అల్పపీడన ద్రోణి వల్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

12/04/2015 - 16:15

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వార్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు.

12/04/2015 - 16:14

ఆఫ్ఘనిస్థాన్ : తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ హతమయ్యారని ఆఫ్ఘనిస్థాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. తాలిబన్ రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణపడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముల్లా అక్తర్ మన్సూర్ హతమయ్యారు.

Pages