S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/04/2015 - 16:14

సిరియా : సిరియాపై గ్రేట్ బ్రిటన్ దాడులను ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఐసిస్ ఉగ్రవాదులకు ఆర్థిక వనరులను సమకూరస్తున్న ఆయిల్ ఫీల్డ్‌పై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడులలో ఒక చమురు క్షేత్రం ధ్వసమైంది. ఈ దాడుల కోసం బ్రిటన్ ఆరు విమానాలను రంగంలోకి దించటమేకాకుండా అమెరికా సంకీర్ణ దళాలతో కలిసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై విరుచుకపడుతోంది.

12/04/2015 - 16:07

చెన్నై : భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నైలో చాలామంది ముందుకు వచ్చి విరాళాలు అందిస్తుండగా 72 ఏళ్ల వయసులో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వయంగా పడవలో అంధుల పాఠాశాలకు వెళ్లి వారికి ఆహార పొట్లాలను అందించారు. లిటిల్ ఫ్లవర్ అంధుల పాఠశాల విద్యార్థుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

12/04/2015 - 16:07

ఢిల్లీ : ములాయంను ప్రధానిగా, రాహుల్‌గాంధీని ఉప ప్రధానిగా చేస్తే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఆయన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కాంగ్రెస్‌తో పొత్తు అంశాన్ని ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. కాగా ఇదే వేదికపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.

12/04/2015 - 13:07

చెన్నై: నగరాన్ని ముంచెత్తి 3 రోజులపాటు వందల కాలనీలను నీటితో ముంచేసిన అడియార్‌నది ప్రవాహం తగ్గడంతో పలు ప్రాంతాలు జలదిగ్భందం నుంచి బయటపడుతున్నాయి. చెంబరంపాకం, కత్తిపార, గిండి, సైదాపేట ప్రాంతాలలో నీరు తగ్గిపోవడంతో ప్రజలు నిత్యావసరాల కోసం పరుగులు తీస్తున్నారు.

12/04/2015 - 13:04

చెన్నై: చెన్నైలోని ఎంఐవోటీ ఆసుపత్రిలో వైద్య సేవలందక 14 మంది మృతిచెందారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 75 మందిలో 18 మంది రోగులు మృతిచెందారు. భారీ వర్షాల చెన్నైలోని సగం ప్రాంతాలకు గత నాలుగు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. రహదారులపై నడుంలోతు నీరు నిలిచిపోవడంతో వైద్య సిబ్బంది కూడా ఆసుపత్రికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.

12/04/2015 - 12:54

చెన్నై : భారీ వర్షాల వల్ల చెన్నై-గూడూరు మధ్య 6 రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ్టి డెహ్రాడూన్‌-చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌, ధన్‌బాద్‌-అలెప్పి, పాట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌, ధన్‌బాద్‌-అలెప్పి, పాట్నా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌, గువాహటి-త్రివేండ్రం, దిబ్రూగఢ్‌-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేశారు.

12/04/2015 - 11:41

చెన్నై: కొద్ది రోజులుగా చెన్నై విమానాశ్రయం నీట మునగడంతో అరక్కోణంలోని నౌకాదళ ఎయిర్‌పోర్ట్ నుంచి పరిమిత సంఖ్యలో విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎయిర్ ఇండియాతోపాటు మరికొన్ని ప్రైవేటు విమానాలు హైదరాబాద్, దిల్లీ, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వెళ్తాయి. విమానాలకు టిక్కెట్టు చార్జీలు కూడా తక్కువగా వసూలు చేస్తారు.

12/04/2015 - 11:41

చెన్నై: శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెన్నైతోపాటు మరికొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యా సంస్థలకు మాత్రం 6వ తేదీ వరకు సెలవులు వర్తిస్తాయి.

12/04/2015 - 11:40

చెన్నై: ఆహార పదార్థాలు, మంచినీరు, ఇతర నిత్యావసర సరకులతో విశాఖ నుంచి బయల్దేరిన రెండు నౌకలు శుక్రవారం ఉదయం ఇక్కడికి చేరుకున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు తూర్పు నౌకాదళం రంగంలోకి దిగింది. హెలికాప్టర్‌ని కూడా నౌకలో తీసుకువచ్చారు. జెమిని బోట్లు, గజ ఈతగాళ్లు, దుప్పట్లు, జనరేటర్లు కూడా ఈ నౌకలో తరలించారు.

12/04/2015 - 07:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: తెలంగాణసహా దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న వైస్‌చాన్సలర్ పోస్టులను ఒక నిర్ణీత వ్యవధిలో భర్తీ చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించాలని కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Pages