S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/03/2015 - 05:51

ఇదో విపత్తు. వరుణ విలయం. వందేళ్లలో కనీవీనీ ఎరుగని కుంభవృష్టి. గత రెండు రోజులుగా తమిళనాడును ముంచెత్తుతున్న భీకర వర్షాలు బుధవారం రాజధాని చెన్నైలో బీభత్సం సృష్టించాయి. ఒక్క రోజులోనే అనూహ్య రీతిలో 45 సెంటీమీటర్ల వర్షం పడటంతో అన్ని రహదారులూ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల మొదటి అంతస్తులోకీ నీళ్లు రావడం వర్ష తీవ్రతను కళ్లకు కడుతోంది. జన జీవనం పూర్తిగా స్తంభించింది.

12/03/2015 - 03:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కరవు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను ఆదుకునేందుకు తొలివిడతగా ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద వందకోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు. దీంతోపాటు ప్రధానమంత్రి కృషి యోజన పథకం కింద 46 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

12/03/2015 - 03:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రతించకుండా కేంద్ర చట్టాల కింద విచారించిన, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు ఏజన్సీలు దర్యాప్తు జరిపిన కేసుల్లో యావజ్జీవ శిక్షలుపడిన నేరస్థుల శిక్షలను తగ్గించే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.

12/03/2015 - 03:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా ఆరు ఐఐటిలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్నాటక, కేరళ, జమ్ము,కాశ్మీర్, చత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తారు. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించారు.

12/02/2015 - 18:35

చెన్నై: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు, వరద వల్ల 'ది హిందు' దిన పత్రిక 137 ఏళ్లలో తొలిసారి చెన్నైలో ప్రింటింగ్ నిలిపివేయగా.. పుతియ తలైమురై, జయ టీవీ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఈ రెండు టీవీ ఛానళ్ల ప్రసారానికి అంతరాయం ఏర్పడింది.

12/02/2015 - 18:21

చెన్నై: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తొలిసారి చెన్నై జూలోకి వరద నీరు వచ్చి చేరింది. వర్షాల వల్ల 40 ఏళ్ల క్రితం జూ చుట్టూ కట్టిన గోడ కూలింది. దీంతో జూ పార్క్ నుంచి మొసళ్లు బయటపడ్డాయన్న వదంతులు చెన్నై ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. అయితే ఆ వార్తలను మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ట్రస్టు ఖండించింది. జూ నుంచి ఒక్క మొసలి కూడా బయటకు వెళ్లలేదని నిర్వహకులు స్పష్టం చేశారు.

12/02/2015 - 16:53

చెన్నై:చెన్నైకి సహాయక బృందాలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే జాతీయ విపత్తు సహాయక దళానికి (ఎన్డీఆర్‌ఎఫ్‌) పది బృందాలను చెన్నైకి తరలించారు. ఆర్మీ, నేవీ బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇక చెన్నై రైల్వే స్టేషన్లలో భారీ ఎత్తున చిక్కుకున్న ప్రయాణికులకు తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు రైల్వే అధికారి అనిల్ సక్సేనా తెలిపారు.

12/02/2015 - 16:48

చెన్నై : చెన్నై మహానగరం నిండుకుండను తలపిస్తున్నది. మొత్తం నగరమంతా నీటిలో ముగినిపోయింది. వరద ఉధృతికి సైదాపెట్‌ ఆనకట్టపైకి వరదనీరు చేరుకుంది. మోకాళ్లలోతు నీళ్ల చేరిన రోడ్లపై వాహనాలను నడుపలేక.. ఇళ్లకు చేరలేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఇళ్లలోనే కూర్చోవాల్సిన పరిస్థితి చెన్నైలో ఉంది.

12/02/2015 - 16:01

చెన్నై : తమిళనాడులోవరదలకు 197 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. టెలిఫోన్, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొంది.

12/02/2015 - 15:59

రాజస్థాన్‌ :రాజస్థాన్‌లోని కోటా, ధోల్‌పూర్‌, సవాయ్‌ మధోపూర్‌, భరత్‌పూర్‌ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం అక్కడ పలు ప్రాంతాల్లో భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో భరత్‌పూర్‌, ధోల్‌పూర్‌లలో పిడుగుపాటుకు ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

Pages