S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/25/2015 - 07:03

స్మార్ట్ సిటీల నిర్మాణంలో పాలుపంచుకోండి
సింగపూర్ పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ ఆహ్వానం
వచ్చే ఏడాదినుంచి జిఎస్‌టి అమలుపై ఆశాభావం

11/25/2015 - 06:44

* షెడ్యూలు విడుదల

11/24/2015 - 18:21

న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల పంపకాలపై కేంద్రం మంగళవారం స్పష్టత ఇచ్చింది. జనాభా నిష్పత్తి దామాషాలో అప్పులను పంపిణీ చేసుకోవాలని సూచించింది. కేంద్రం సూచన ప్రకారం ఏపీకి 58.38శాతం, తెలంగాణకు 41.68శాతం అప్పులు పంపిణీ చేసుకోవాల్సి ఉంటుంది.

11/24/2015 - 16:39

న్యూఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో అసహనం పెరిగిందని బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యానించడం చాలా దారుణమని కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజుజు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మేం అధికారంలోకి వచ్చాక మత ఘర్షణలు తగ్గాయని అన్నారు. 2013తో పోలిస్తే.. ఆ సంఖ్య బాగా తగ్గిందని కిరణ్‌ రిజుజు పేర్కొన్నారు.

11/24/2015 - 16:20

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని రత్లాం లోకసభ నియోజకవర్గం కోసం జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా 88 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి నిర్మలా భురియాపై గెలుపొందాడు.

11/24/2015 - 14:23

న్యూఢిల్లీ: దేశంలో అసహనంపై బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆయన వ్యాఖ్యలపట్ల కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీర్‌ భారత్‌లో క్షేమంగానే ఉన్నారని.. ఆయన వ్యాఖ్యలతో తన అభిమానులను అవమానించారని కేంద్ర మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఇలాంటి ఘోరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని మరో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు.

11/24/2015 - 13:37

మణిపూర్ : మణిపూర్‌లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థులు గెలుపొందారు. దీంతో తొలిసారి మణిపూర్ అసెంబ్లీలోకి బిజెపి అభ్యర్థులు అడుగుపెడుతున్నారు. తంగెమిబంద్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కుముక్చిమ్ జోయోకిషన్ కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిస్ వైకోమ్‌పై విజయం సాధించారు.

11/24/2015 - 13:34

చత్తీస్‌గడ్ : చత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. సుకుమా జిల్లాలో ఓ ప్రైవేటు బస్సును తగులబెట్టారు. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. టోంగ్‌పాల్ స్టేషన్ పరిధిలోని టహాక్‌వాడా గ్రామంలో వాహనాన్ని తగులబెట్టారు. అలాగే యాంటీ-లాండ్‌మైన్ వాహనానికి నిప్పుపెట్టారు.

11/24/2015 - 11:41

చెన్నై: ఇక్కడి ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం ఇద్దరు ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు సోదా చేసి 8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.75 కోట్లు ఉంటుందని అంచనా. తనిఖీల్లో ఓ ప్రయాణీకుడి నుంచి 5.5 కిలోలు, మరో వ్యక్తి నుంచి 2.5 కిలోల బంగారాన్ని గుర్తించారు.

11/24/2015 - 06:36

న్యూఢిల్లీ, నవంబర్ 23: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితతో పాటు మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది.

Pages