S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/27/2020 - 23:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ బదిలీ వ్యవహారం దుమారం సృష్టించింది. గురువారం అర్థరాత్రి అకస్మాత్తుగా ఆయన బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. జస్టిస్ మురళీధర్ ఆకస్మిక బదిలీని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఆయన బదిలీని అధికార బీజేపీ సమర్ధించింది. న్యాయమూర్తి బదిలీ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని, ‘సాధారణ’ బదిలీగానే చూడాలని బీజేపీ నేతలు చెప్పారు.

02/27/2020 - 05:25

కాకినాడ: మూడున్నర కోట్ల మంది కార్మికులు, వారిపై ఆధారపడిన 12 కోట్ల మంది కుటుంబ సభ్యుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. కాకినాడ సాంబమూర్తినగర్‌లో రూ.110 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రికి కేంద్ర మంత్రి గంగ్వార్ బుధవారం భూమి పూజ నిర్వహించారు.

02/27/2020 - 05:23

ఢిల్లీ: సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడమే కాకుండా మతఘర్షణలుగా రూపాంతరం చెందుతున్నది. అల్లరి మూకలు యధేచ్ఛగా వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. బుధవారం కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు పలు దుకాణాలను లూటీ చేశారు. కొన్ని దుకాణాలను తగుల బెట్టారు. భద్రతా బలగాలపై రాళ్ళు రువ్వారు. ఈ సంఘటనలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకిపోతున్నది.

02/27/2020 - 05:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ రాజధానిలోని ఈశాన్య ఢిల్లీలో మూడు రోజుల పాటు కొనసాగిన అల్లర్లపై ప్రతిపక్షాలు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పిర్యాదు చేయనున్నాయి. ఢిల్లీ అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా చేత రాజీనామా చేయించాలని వారు రాష్టప్రతిని కోరనున్నారు.

02/27/2020 - 05:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: జాతీయ సాంకేతిక జౌళి మిషన్‌ను 1480 కోట్ల రూపాయల వ్యయం తో ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో నిర్ణయించింది. సాంకేతిక జౌళి రంగంలో దేశాన్ని అంతర్జాతీయ నాయకుడిగా అభివృద్ధి చేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

02/27/2020 - 04:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న సమస్యాత్మక ప్రాంతాల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ బుధవారం సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. అక్కడి స్థానికులతో ఆయన మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకొని, వివరాలను ఆయనకు అందజేశారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని విలేఖరులతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

02/27/2020 - 04:58

చెన్నై, ఫిబ్రవరి 26: త్వరలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి తమకు ఓ సీటును కేటాయించాలని ఏఐఏడీఎంకేను విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే బుధవారం డిమాండ్ చేసింది. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ ఈ స్థానాన్ని కేటాయించాలని విజయ్‌కాంత్ తరఫున ఆయన భార్య ప్రేమలత ఏఐఏడీఎంకేకు విజ్ఞప్తి చేయగా అధిష్ఠానంతో సమాలోచనలు జరిపి నిర్ణయం తీసుకొంటామని వివరణ ఇచ్చినట్లు సమాచారం.

02/27/2020 - 02:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ బుధవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.

02/27/2020 - 02:57

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శాంతి, సోదరభావం నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నరేంద్ర మోదీ బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. ఢిల్లీలో గత మూడు రోజులు జరిగిన అల్లర్లపై నరేంద్ర మోదీ మొదటిసారి స్పందిస్తూ శాంతి, సామరస్యం మన సంస్కృతి మూల స్తంభాలంటూ అన్ని వేళలా శాంతి, సోదరభావం నెలకొల్పాలని ఢిల్లీలోని సోదర, సోదరీమణులకు విజప్తి చేస్తున్నానని తెలిపారు.

02/27/2020 - 02:58

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేయడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సోనియా గాంధీ బురద రాజకీయం చేస్తున్నారంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.

Pages