S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/10/2019 - 01:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సారధ్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.

02/10/2019 - 03:42

షిల్లాంగ్, ఫిబ్రవరి 9: చిట్‌ఫండ్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కొతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ పోలీసులు ఇక్కడ విచారించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య రాజీవ్ కుమార్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇక్కడికి రాజీవ్ కుమార్ , ఆయన తరఫున న్యాయవాది బిశ్వజిత్ దేబ్ , సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు జావేద్ షామీమ్ , మురళీధర్ శర్మ వచ్చారు.

02/10/2019 - 00:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శనివారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ‘ఇంటికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని శనివారం ఆయన ట్వీట్ చేశారు. జైట్లీ అనారోగ్యం కారణంగా, ఆర్థిక శాఖను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించిన విషయం తెలిసిందే.

02/10/2019 - 05:07

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని మోదీ ఏం మొహం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. ‘మోదీ సభను అడ్డుకొబోం. అయితే నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తాం’ అని ఆయన అన్నారు.

02/09/2019 - 18:01

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ భారత్‌కు తిరిగివచ్చారు. ఆయన కిడ్నీ చికిత్స చేయంచుకుని కోలుకున్న ఆయన క్యాన్సర్ బారన పడ్డారు. అమెరికాలో చికిత్స చేయంచుకున్న తరువాత భారత్‌కు తిరిగివచ్చారు. ఇంటికి రావటం సంతోషంగా ఉందని జైట్లీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జైట్లీ అమెరికాలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన స్థానంలో పీయూష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే.

02/09/2019 - 17:26

న్యూఢిల్లీ:పౌరసత్వ సవరణ బిల్లు ఎవరికీ ఎటువంటి హానీ జరుగదని ప్రధాని మోదీ అన్నారు. ఆయన శనివారం అస్సాంలోని సుమలిగఢ్ రిఫైనరీకి శంకుస్థాపన చేశారు. అనంతరం బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఆరు వరుసల వంతెనకు శంకుస్థాపన చేశారు. అనంతరం గుహవాటిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లుపై ఏసీ గదుల్లో కూర్చున్నవారు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.

02/09/2019 - 13:03

న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యహాంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కు, రఘువీరా రెడ్డి తదితరులు హాజరయ్యారు.

02/09/2019 - 13:02

న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కలిగివున్నారనే కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా మూడవ రోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఆస్తులు కూడబెట్టారని ఈడీ కేసు నమోదు చేసింది. తొలిరోజు ప్రియాంకగాంధీ భర్త వాద్రాతో కలిసి స్వయంగా వచ్చారు. ఆరోజు వాద్రాను దాదాపు ఆరుగంటల పాటు విచారణ చేశారు.

02/09/2019 - 13:01

గౌహతి:అస్సాంలో ప్రధాని మోదీకి చేదు అనుభవం ఎదురైంది. రాజ్‌భవన్‌కు వెళుతున్న ఆయనకు అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నల్లజెండాలతో నిరసన తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వారు తమ నిరసన తెలిపారు. ఇదిలావుండగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండవ రోజు కూడా తమ నిరసన తెలిపారు.

02/09/2019 - 12:59

బెంగళూరు: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా రామజోగి హళ్లిలో ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ముగ్గురు ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. చిన్నారుల తల్లి నాగరత్నమ్మ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.

Pages