S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/21/2019 - 16:30

బెంగళూరు: నడిచే దేవుడిగా భక్తులు ఆరాధించే ప్రసిద్ధ సిద్దగంగ మఠాధిపతి శవకుమారస్వామి ఈరోజు ఉదయం 11.44కి శివైక్యం చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులోని ప్రసిద్ధ సిద్దగంగ మఠాధిపతి అయిన కుమారస్వామి (111) గత 15 రోజులుగా ఊపిరితిత్తుల్లో ఇనె్ఫక్షన్ తలెత్తటంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను భక్తులు 12 శతాబ్దంలో సంఘసంస్కర్తగా బసవరూపంలో అవతరించిన అవతారమూర్తిగా ఆరాధిస్తుంటారు.

01/21/2019 - 13:07

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయ. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీనే బడ్జెట్ ప్రవేశపెడతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయ. కిడ్నీ సంబంధిత చికిత్స చేయంచుకున్న అరుణ్‌జైట్లీ జనరల్ చెకప్ కోసం అమెరికా వెళ్లారని, ఆయనే బడ్జెట్ ప్రవేశపెడతారని తెలిపాయ.

01/21/2019 - 13:06

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బాద్గాం జిల్లాలోని జిన్ పంచాల్ ఏరియాలో ముష్కరులు తలదాచుకున్నారని సమాచారం అందటంతో భ ద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయ. సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో బ ద్రతా బలగాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

01/21/2019 - 13:05

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు నియమాకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించే బెంచ్ నుంచి సీజేఐ రంజన్ గొగొయ్ తప్పుకున్నారు.

01/21/2019 - 12:22

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో 13 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన నిందితుడు మెహుల్ ఛోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఆయనకు అంటిగ్వా పౌరసత్వం కూడా ఉంది. మెహుల్ ఛోక్సీకి రెండు పౌరసత్వాలు ఉండరాదని భారత విదేశాంగ ఆంక్షలు విధించటంతో ఆయన భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు.

01/21/2019 - 12:16

న్యూఢిల్లీ: చలి గాలులతో ఉత్తర భారతం వణుకుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఒక విధంగా మంచు కురుస్తుండటంతో సిమ్లాను తలపిస్తోందని అంటున్నారు. చత్తీస్‌గఢ్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచుతో వీస్తున్న చలి గాలులకు పశువులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంది.

01/21/2019 - 04:23

వారణాసి: భారతీయ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి ‘అతిథి దేవోభవ’ అన్న నానుడికి అద్దం పట్టేలా ముస్తాబవుతోంది. కుంభమేళా సందర్భంగా వేలాదిమందికి ఆతిథ్యాన్నిస్తున్న ఈ ఆధ్యాత్మిక నగరం ప్రవాసీ దినోత్సవానికి రెండింతలుగా సన్నద్ధమవుతోంది. ఆత్మీయత, ఆప్యాయత, ఆదరణ గీటురాళ్లుగా అతిథులను అక్కున చేర్చుకునేందుకు సన్నద్ధం అవుతోంది.

01/21/2019 - 03:42

ముంబయి: ఆర్థికంగా బలహీనమైన ఐదు దేశాల నుంచి ఇప్పుడు భారతావనీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఇక్కడ మాట్లాడిన మోదీ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఈ నాలుగున్నర ఏళ్లలో సాధించిన విజయాలపై ప్రసంగించారు.

01/21/2019 - 02:14

పుణె, జనవరి 20: దేశంలో ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం లేదని, ఆయన లేకపోతే అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు.

01/21/2019 - 02:12

తిరుచనాపల్లి, జనవరి 20: దేశీయ రక్షణ పరికరాల ఉత్పత్తుల తయారీ ప్రోత్సాహకంలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను దేశ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రారంభించారు.

Pages