S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/25/2018 - 02:18

శబరిమల, డిసెంబర్ 24: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోడాని వచ్చిన ఇద్దరు మహిళను ఆందోళనకారలు అడ్డకించడంతో వెనుదిరిగారు. భక్తుల ఉంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం రావడంతో పూజలు చేయకుండానే వెనుదిరిగారు. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళల ప్రయత్నం ఫలించలేదు.

12/25/2018 - 02:16

గుజరాత్‌లోని సూరత్‌లో సోమవారం సామూహిక వివాహాలు జరిగాయి. సామూహిక వివాహం చేసుకున్న
261వ మంది వధువులు వీరు

12/25/2018 - 02:09

లక్నో, డిసెంబర్ 24: ‘కాదేదీ రాజకీయాలకు అనర్హం’ అన్నట్టుగా నేటి నేతల పోకడలు వింతగా, విడ్డూరంగా సాగుతున్నాయి. మనం నిత్యం ఆరాధించే, పూజించే పురాణ పురుషులను సైతం రాజకీయాల్లోకి లాగి వారి దైవత్వానికే భంగం కలిగించే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో తీవ్రమయ్యాయి. నిన్న రాముడు, నేడు ఆయన పరమభక్తుడైన హనుమంతుడు.. ఇలా ఎవరినీ వదలకుండా సాగుతున్న నేతల వాచాలత విస్మయానే్న కలిగిస్తోంది.

12/25/2018 - 01:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడోరోజు సోమవారం వాయుకాలుష్యం జడలు విప్పింది. వాతావరణంలో వచ్చిన మార్పులు, వివిధ కారణాల వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నగర పౌరులు పర్వదినాలను ప్రశాంత వాతావరణంలో చేసుకునే పరిస్థితులు లేవు. దీపావళి రోజు అత్యధిక స్థాయిలో కాలుష్యం విజృంభించింది. వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో నమోదైంది.

12/25/2018 - 04:40

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని దివంగత ఎన్టీ రామారావు స్థాపించలేదని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. ఆంధ్రభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌తో కలిసి కంభంపాటి విలేఖరులతో మాట్లాడారు. తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలుగుదేశం పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

12/25/2018 - 01:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ కూటమి పేరుతో ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్న ప్రయత్నం కాంగ్రెస్ గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ఆ ఫ్రంట్‌లో చేరితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది.

12/25/2018 - 01:19

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి చేసిన కృషి, త్యాగాల మూలంగానే బీజేపీ ఈ స్థాయికి చేరిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం పార్లమెంటు ఆవరణలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో వాజపేయి జ్ఞాపకార్థం రూ.100 నాణాన్ని విడుదల చేశారు.

12/24/2018 - 05:13

చెన్నై: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కూటమి అపవిత్ర పొత్తుల కలయిక అని, ఈ ఫ్రంట్‌ను ప్రజలు విశ్వసించరని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. కేవలం వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి పొందేందుకు, అధికార కోసం తాపత్రయపడే పార్టీలే ఇందులో చేరుతున్నాయన్నారు. ఈ కూటమిలోని పార్టీలకు ప్రజల మద్దతు ఉండబోదన్నారు.

12/24/2018 - 03:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: వచ్చే సంవత్సరం లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయం సాధించటంతోపాటు నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపడతారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఆదివారం ఆయన బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీష్‌కుమార్, కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి అధినేత రాం విలాస్ పాశ్వాన్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడారు.

12/24/2018 - 02:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఇప్పటికే క్లీన్‌చిట్ పొందిన జగదీష్ టైట్లర్‌పై మళ్లీ ఉచ్చు బిగుసుకుంటోందా అన్న ఊహాగానాలు మొదయ్యాయి. ఇటీవల ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు శిక్షపడటంతో జగదీష్ టైట్లర్‌పై చర్య తీసుకునే అవకాశాలు మెరుగయ్యాయని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Pages