S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/08/2018 - 12:24

జైపూర్ : రాజస్థాన్‌లో బ్యాలెట్ బ్యాక్స్ రోడ్డుపై పడివున్న ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. కిషన్‌గంజ్ నియోజకవర్గంలోని షాహబాద్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి రోడ్డుపై సీలు వేసిన బ్యాలెట్ బ్యాక్స్ పడివుండటాన్ని గమనించిన పోలీసులు దానిని ఈవీఎంలు నిల్వవుంచిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈ ఘటనలో అబ్దుల్ రఫీక్, నవల్ సింగ్ పట్వారీలను సస్పెండ్ చేశారు.

12/08/2018 - 12:22

చండీగఢ్: సర్జికల్ దాడులపై విపరీతమైన ప్రచారం చేస్తున్నారని విశ్రాంత లెఫ్ట్‌నెంట్ జనరల్ డీఎస్ హుడా పేర్కొన్నారు. సర్జికల్ దాడులు జరిగి రెండేళ్లు అయిన సందర్భంగా మాట్లాడుతూ సర్జకల్ దాడులు ఎప్పటికప్పుడు చేస్తుండాలి అని దీనికి ఇంత ప్రచారం అవసరమా అనేది రాజకీయ నేతలనే అడగాలని అన్నారు. సైన్యం సరిహద్దుల్లో క్రీయాశీలకంగా వ్యవహరించాలని అన్నారు.

12/08/2018 - 12:18

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రధాని మోదీ తుగ్లక్‌లా, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఔరంగజేబులా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంజాబ్ మంత్రి సిద్ధూ తలను తెచ్చిన వారికి కోటి రూపాయల రివార్డును హిందూ యువ వాహిని ప్రకటించిన నేపథ్యంలో సూర్జేవాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

12/08/2018 - 12:18

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో బస్సు లోయలోపడి 11మంది దుర్మరణం పాలైన సంఘటన ఇది. లోరన్ నుంచి పూంఛ్ వెళుతున్న బస్సు శనివారం తెల్లవారు జామున లోయలో పడింది. ఈ ఘటనలోమరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇపుడే చెప్పలేమని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

12/08/2018 - 04:27

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంల పట్ల జాగరూకత వ్యవహించాలి, ప్రధాని నరేంద్ర నాయకత్వంలోని భారత్‌లో ఎలక్ట్రానింగ్ ఓటింగ్ యంత్రాలు వింతగా వ్యవహరిస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాహుల్ ట్వీట్ చేశారు. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి.

12/08/2018 - 03:30

పనాజీ, డిసెంబర్ 7: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జీడీపీ పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ అసోచామ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ)ని పెంచాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు.

12/08/2018 - 03:29

వారణాసి, డిసెంబర్ 7: హనుమంతుడు కులం వ్యవహారంమై తలెత్తిన వివాదం ఆసక్తికరమైన మలుపుతిరిగింది. హనుమంతుడు దళితుడని కమలనాథులు చేసిన ప్రకటన రాజకీయ రంగుపులముకుంటోంది. యూపీలోని శివపాల్ యాదవ్ నాయకత్వంలోని ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) ఏకంగా హిందు దేవుళ్ల కులాల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు వారణాసిలోని జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసులో దరఖాసు చేశారు.

12/08/2018 - 03:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: రక్షణ ఒప్పందాలకు సంబంధించి ముడుపులు చేతులు మారాయన్న అభియోగాల కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సన్నిహితుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. వాడ్రా స్నేహితుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించడం ఇదే తొలిసారి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సోదాలను ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో అధికారులు నిర్వహించారు.

12/08/2018 - 02:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ బలం విస్తరించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంబేలెత్తి రథయాత్రను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం గొంతు కోసే విధంగా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారన్నారు.

12/08/2018 - 02:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: భారత్‌లోని మహిళలకు భద్రతే లేదన్నట్టు దేశమీడియా అతిశయంగా చూపుతోందని, కాని వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని, మీడియా ఈ విషయంలో ఎప్పుడూ వాస్తవాలను చిత్రీకరించదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆరోపించారు.

Pages