S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/16/2020 - 16:56

న్యూఢిల్లీ: నిర్భయ దోషులలో ఒకరైన ముకేశ్‌సింగ్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఇది విచారణకు స్వీకరించతగినది కాదని పేర్కొంది. ముకేశ్‌సింగ్ తన పిటిషన్‌లో క్యూరేటివ్, మెర్సీ పిటిషన్లను స్వీకరించాలని కోరారు. అయితే ముకేశ్ చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇదిలావుండగా ఈ కేసులో దోషులకు వేసిన ఉరిశిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడింది.

03/16/2020 - 13:43

న్యూఢిల్లీ: ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొంది.

03/16/2020 - 13:42

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోకసభలో ఆయన మాట్లాడుతూ.. భార‌త్‌లో ఉద్దేశ‌పూర్వ‌కంగా బ్యాంకు రుణాల‌ను ఎగ‌వేసిన 50 మంది వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని రాహుల్ ప్ర‌శ్నించారు. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ దారుణంగా ఉంద‌న్నారు. అవి విఫ‌ల‌మైన‌ట్లు రాహుల్ చెప్పారు. భ‌విష్య‌త్తులో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ మ‌రింత దిగ‌జారే అవ‌కాశం ఉంద‌న్నారు.

03/16/2020 - 13:41

న్యూఢిల్లీ:ఎస్ బ్యాంక్ సంక్షోభంలో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం విదితమే. అనిల్ అంబానీకి చెందిన ఆస్తులు ఎస్ బ్యాంకు నుంచి పొందిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఈడీ పేర్కొంది.

03/16/2020 - 13:40

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. శాసనసభ సమావేశాలు వాయిదా పడటంతో నేడు ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవటం లేదు. మధ్యప్రదేశ్‌లో సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ లాల్జీ టాండర్ గత శనివారం ఆదేశించారు.

03/16/2020 - 05:35

భోపాల్: మధ్యప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ హైడ్రామా చరమాంకానికి చేరుకుంది. సోమవారం నాడు తన మెజారిటీని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించారు. అయితే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలా? లేదా? అన్న అంశంపై రూలింగ్ ఇవ్వబోతున్నానని స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి వెల్లడించారు.

03/16/2020 - 05:31

*చిత్రం... కరోనా వైరస్ బాధితులు త్వరితగతిన కోలుకోవాలని ఆదివారం అమృత్‌సర్‌లో యజ్ఞం చేసిన హిందూ భక్తులు

03/16/2020 - 05:29

లక్నో, మార్చి 15: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభకు 2022లో జరిగే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) 350 స్థానాల్లో విజయం సాధిస్తుందని అరచేతిని చూసి భవిష్యత్తును చెప్పే ఒక జ్యోతిష్యుడు (పామ్ రీడర్) ఇటీవల తనకు చెప్పాడని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆదివారం నాడు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి.

03/16/2020 - 05:23

న్యూఢిల్లీ, మార్చి 15: నిర్భయ దోషుల ఉరితీత గడువు దగ్గర పడుతోంది.. మార్చి 20న ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ దోషులైన ముకేష్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లను తీహార్ జైలులో ఉరి తీయనున్నారు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

03/16/2020 - 05:16

చెన్నైలో విద్యార్థులు వినూత్న రీతిలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక ప్రచారం చేశారు. ‘చేతులు కడుక్కోండి.. దీర్ఘకాలం జీవించండి’ అన్న సందేశాన్ని 2,500 సబ్బులతో అందించారు,

Pages