S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/04/2018 - 01:25

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకుంటోందా ? ఉగ్రవాదం చొరబడుతోందని, ఈ మేరకు తమ వద్ద సమాచారం ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ శక్తులకు బయట నుంచి మద్దతు లభిస్తోందన్నారు. శనివారం ఇక్కడ సీనియర్ ఆర్మీ అధికారులు, రక్షణ రంగ నిపుణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

11/04/2018 - 05:00

హరిద్వార్, నవంబర్ 3: ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని ప్రత్యేక సామర్థ్యాలను గ్రహించి, వాటిని ఉత్తమ స్థాయిలో వెలికితీయాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు ఇలా చేయడం ద్వారా ఉన్నత విద్యలో గుణాత్మక మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలరని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి పతంజలి యోగ్‌పీఠ్‌లో ‘జ్ఞాన్‌కుంభ్’ పేరిట రెండు రోజుల పాటు జరిగే సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు.

11/03/2018 - 23:17

న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రధాని నరేంద్రమోదీ ‘శివలింగంపై తేలు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్‌నేత శశిథరూర్‌పై పరువునష్ట దావా వేశారు. థరూర్ వ్యాఖ్యలు ప్రధాని పదవినే కాకుండా శివభక్తులను అవమానించేలా ఉన్నాయంటూ ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ అన్నారు. ఐపీసిలోని 499,500 సెక్షన్ల కింద కాంగ్రెస్ ఎంపీపై ఆయన పరువునష్టం దావా వేశారు.

11/03/2018 - 16:57

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌పై బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ పరువు నష్టం దావా వేశారు. మోదీని శివలింగంపై ఉన్న తేలు అని శశిథరూర్ ఒక సభలో వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహాం వ్యక్తంచేసిన ఆయన థరూర్ తన వ్యాఖ్యలతో కోట్లాది మంది శివభక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ఆయన హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

11/03/2018 - 16:54

న్యూఢిల్లీ: తనపై మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లైంగిక దాడికి పాల్పడ్డారని మీటూ ఉద్యమంలో భాగంగా తీవ్ర ఆరోపణలు చేసిన పాత్రికేయురాలు పల్లవి గొగొయ్ ట్విట్టర్‌లో స్పందించారు. నేను దీనిపై నిజాలు వెల్లడిస్తూనే ఉంటానని అన్నారు. దీనివల్ల అతని చేత వేధింపులకు గురైన మిగిలినవారు బయటకు వస్తారని అన్నారు. కాగా మా మధ్య బంధం ఇద్దరి అంగీకారం వల్ల జరగలేదని, ఒత్తిడి, అధికార దుర్వినియోగంతో జరిగిందని అన్నారు.

11/03/2018 - 16:53

డెహ్రాడూన్: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా మంచు వర్షం కురుస్తుంది. జమ్మూకాశ్మీర్, శ్రీనగర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో శనివారంనాడు వేకువజాము నుంచి మంచు వర్షం కురుస్తుంది. దీంతో కేదార్‌నాథ్ దేవాలయంలో భక్తులు స్వల్ప సంఖ్యలోనే స్వామిని దర్శించుకున్నారు. కులూ, మనాలిలోనూ కురిసిన మంచు వర్షం వల్ల ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.

11/03/2018 - 16:52

న్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మా తొలగింపు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ లోకసభ నాయకుడు ఖర్గే సుప్రీంలో శనివారంనాడు పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తిగా అనైతిక చర్య అని మలిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. సీబీఐ చీఫ్ రెండేళ్ల నిర్ణీత పదవీకాలం ఉంటుందని అన్నారు. సెలక్షన్ కమిటీ ఆమోదం లేకుండా బదిలీ చేయకూడదని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

11/03/2018 - 12:47

న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలోని శారద యూనివర్శిటీలో డిగ్రీ చదువుతున్న కాశ్మీర్‌కు చెందిన అహ్‌తేషమ్ బిలాలీ సోఫీ (17) ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఢిల్లీ వెళుతున్నానని యూనివర్శిటీ యాజమాన్యానికి చెప్పిన ఈ విద్యార్థి రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఉగ్రవాద సంస్థలో చేరినట్లు ఫొటో ఒకటి సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

11/03/2018 - 12:45

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 19 పైసలు తగ్గింది. దీంతో ఈరోజు పెట్రోల్ ధర రూ.78.99గా ఉంది. అలాగే డీజిల్ ధర 11పైసలు తగ్గి రూ.73.33గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.83.75గా ఉండగా, డీజిల్ ధర రూ.80కి చేరుకుంది.

11/03/2018 - 12:42

నాగపూర్: మాహారాష్టల్రోని యావత్‌మాల్ జిల్లా మాండ్రకోడ అడవుల్లో దాదాపు 14మంది మనుషులను చంపిన ఆడపులి ‘అవని’ని చంపేశారు. గత కొన్ని నెలలుగా ఈ పులి కోసం గాలిస్తున్నారు. కనిపిస్తే చంపేయ్యమనే ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ షూటర్ దీన్ని కాల్చిచంపారు. దీని మృత కళేబరానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు.

Pages