భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకత ఉంది. దేవతారాధనకు, పూజలకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం సంస్కృతిలో ఒక భాగం అయింది. ఈ నేపధ్యంలో దేశంలో దివ్యక్షేత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయమైన శ్రీకాకుళం జిల్లాలో మరొక పుణ్యక్షేత్రం శ్రీ సంతోషిమాత అమ్మవారి శక్తిపీఠం.













