స్‌బుక్‌లో సౌకర్యాలు ఇన్నీ అన్నీకావు. చాటింగు, వీడియో కాలింగ్ కూడా సాధ్యమే. అంటే, ఫేస్‌బుక్‌లోకి మీరు లాగిన్ అయ్యారనుకోండి. ఆ సమయంలో మీ మిత్రులు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చి వుంటే, వారితో నేరుగా చాటింగ్, వీడియో కాలింగ్ చేసి మాట్లాడుకోవచ్చన్నమాట.
కంప్యూటర్ కబుర్లు
స్‌బుక్‌లో సౌకర్యాలు ఇన్నీ అన్నీకావు. చాటింగు, వీడియో కాలింగ్ కూడా సాధ్యమే. అంటే, ఫేస్‌బుక్‌లోకి మీరు లాగిన్ అయ్యారనుకోండి. ఆ సమయంలో మీ మిత్రులు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చి వుంటే, వారితో నేరుగా చాటింగ్, వీడియో కాలింగ్ చేసి మాట్లాడుకోవచ్చన్నమాట.
ఫేస్‌బుక్‌లో మీ ఫొటో ఆల్బమ్‌లు క్రియేట్ చేశారు కదా! మీ ఆల్బమ్‌కు సెట్టింగ్స్ గురించి కొంత సమాచారాన్నివ్వాలి. అంటే, మీ ఆల్బమ్‌ను మిత్రుల (ఫొటోల)కు ట్యాగ్‌చేయమని అడుగుతుంది. ట్యాగ్ చేసేటపుడు, మీ మిత్రులను గుర్తిస్తారన్నమాట.
ఫేస్‌బుక్‌లో అకౌంటున్నంత మాత్రాన సరిపోదు. దాన్లో సదా సమాచారాన్ని పెడ్తుంటేనే క్రమంగా మిత్రులు, వారి మిత్రులు- అందరూ మనకు మిత్రులవుతారు. కొంచెం టచ్‌లో ఉంటే, అన్నీ అందరూ చెబుతారు. మీ విశేషాలే కాదు, ఫొటోలు, వీడియోలు కూడా మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏ అలంపురమో వెళ్లి ఫొటోలు తీసారు.
గోడ పత్రికలు ఒకనాడు ఎంతో పాపులర్. గోడపత్రికలు నడపడం ఒక క్రేజ్. ఆరోజు గోడపత్రికలో ఎముంటుందో చూద్దాం అనుకుంటూ అక్కడికి వెళ్ళి దాన్ని చదవడం మరో క్రేజ్. ఇదంతా ఎందుకండీ? అంటే... విభిన్నత్వం, వినూత్నత్వం, సరదా కోసం. రోజులు మారాయి. గోడ పత్రికల ఆలోచన కాస్తా కంప్యూటర్ నెట్‌వర్క్‌ల్లోకి చేరింది.
పేస్‌బుక్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, ఫ్రెండ్స్‌ను ఎంచుకొని వారిని ఫ్రెండ్స్‌గా అంగీకరించినంత మాత్రాన సరిపోదు. దాంతోబాటు మీ ప్రొఫైల్ పేజీని మీ వ్యక్తిగత వివరాలతో నింపాలి. అపుడే మీరేమిటో ఇతరులు తెలుసుకునే వీలు కలుగుతుంది. మీ ప్రొఫైల్‌ను నింపడానికి పైలైనులో ప్రొఫైల్ అని కనిపిస్తుంది.
ఫేస్‌బుక్. దీని గురించి పదే పదే చెప్పాల్సి వస్తుంది... ఎందుకంటే, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లలో దీనికుండే ప్రజాదరణ తర్వాతే దేనిదైనా! ఎనిమిదేళ్ళ క్రితం అంటే 2004లో ఆరంభమైన ‘ఫేస్‌బుక్’లో ఇప్పటికే 54.5 కోట్ల సభ్యులున్నారనీ, ఇది ఈ ఏడాది అంతంలోగా 100 కోట్లకు చేరగలదనీ విశే్లషకుల అంచనా.
గత వారం పలు సాధారణ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, విద్యార్థుల కోసం, షాపింగ్ కోసం, సిన్మాలూ- సంగీతమూ, ప్రకృతి- ఎడ్వంచర్లూ, సైన్సు- వీటికి సంబంధించిన సైట్లను ఒక జాబితాగా ఇవ్వడం జరిగింది.
సోషల్‌నెట్ వర్కింగ్ అంటే గుర్తొచ్చింది. ఈమధ్య ఒకాయన ఫోన్ చేశాడు మరో మిత్రుడి పేరు రెఫరెన్సుతో. సోషల్ గేదరింగ్, గేమ్స్, ప్రోగ్రామ్స్ అంటూ మొదలెట్టాడు కబుర్లు. ఇదేదో కంట్రీ క్లబ్బు బాపతుగా ఉందనుకొని, సారూ! మీ ప్రోగ్రామ్ ఏమిటో మెయిల్ చేయండి. నాకు నచ్చితే చేరతానన్నా. చిటికెలో మెయిల్ వచ్చింది.