నాగమల్లి పూవులా.. నాగావళి నది పాయలా మిలమిలామెరుస్తూ... అందాలు విరజిమ్ముతూ ఆఫీసులోకి అడుగుపెట్టిన విరజ వైపు ఆరాధనగా చూస్తూ చిరునవ్వుతో స్వాగతం పలికాడు శ్రీకాంత్.
ఈ వారం కథ
నాగమల్లి పూవులా.. నాగావళి నది పాయలా మిలమిలామెరుస్తూ... అందాలు విరజిమ్ముతూ ఆఫీసులోకి అడుగుపెట్టిన విరజ వైపు ఆరాధనగా చూస్తూ చిరునవ్వుతో స్వాగతం పలికాడు శ్రీకాంత్.
రేపు సాయంత్రం పెళ్లిచూపులకు వాళ్ళొస్తున్నారు. నాలుగ్గంటలకల్లా సిద్ధంగా ఉండండి’ అంటూ తల్లిని పురమాయిస్తున్న తండ్రి మాటలు సృజన చెవులబడ్డాయి.
గదిలో కూర్చున్న సృజనతోబాటుగా ఆమె స్నేహితురాలు కావ్య కూడా ఉంది.
‘‘కాఫీ టిఫిన్ తయ్యార్!’’ -అంటూ పొద్దునే్న ఎలుగెత్తి పిలవడం సరదాగా ఉండేది ఎనిమిదేళ్ళప్పుడు నాకు. పొద్దునే్న నాన్నకి, నలుగురన్నలకి, అవ్వకి సత్తుగ్లాసులో కాఫీతోపాటు, అందరికీ ఇత్తడి మూతల్లో జొన్న రొట్టెతో ఉల్లికారం పెట్టేదాన్ని. మరోసారి గట్టిగా, ‘‘అన్నయ్యా, అవ్వా..
సుజా! వాడిని చావనీ! తనకు తానే తగిన శాస్తి చేసుకున్నాడు. నిద్రమాత్రలు మింగి మంచిపని చేశాడు. వాడి భార్య ఇప్పటికైనా ఊపిరి పీల్చుకుంటుంది. వీడి హింస భరించలేక ఇళ్ళొదిలి వెళ్లింది. గర్భవతి అని కూడా చూడలేదు త్రాష్టుడు. ఎక్కడో దూరపు బంధువుల ఇంట్లో దిక్కులేనిదానిలా..
ఉన్నట్లుండి ఊడిపడ్డ కూతుర్ని, అల్లుణ్ణి చూసి విస్మయానికి గురయ్యారు నారాయణరావు దంపతులు.
‘‘వచ్చేముందు ఫోన్ చెయ్యకపోయారా, స్టేషన్‌కొచ్చేవాణ్ణి కదా!’’ అంటూ అల్లుడి చేతిలోని సూట్‌కేసునందుకున్నాడు నారాయణరావు.
సుమన్ ఆ పాటంటే చెవి కోసుకుంటాడు. బాత్‌రూంలో సబ్బు రుద్దుకొంటూనో, ఆఫీసులో అర్జెంటు ఫైల్సు చూస్తున్నపుడు కూడా లోలోన ఓ చిన్న కూనిరాగం తీస్తూనే పూర్తిచేస్తాడు.
రిస్ట్‌వాచీ చూసుకుంది చిత్ర. పది కావస్తోంది. దగ్గరే కదా అని రిక్షా ఎక్కనందుకు తనను తాను తిట్టుకుంది.
రెయిన్‌బో లేడీస్ క్లబ్‌లో ఉదయం నుంచే సందడి మొదలైంది. ఆ రోజు వార్షికోత్సవం. సభ్యులకు అక్కడే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లున్నాయి. ఉదయం తొమ్మిదినుంచి రకరకాల పోటీలు ప్రారంభమయ్యాయి. మ్యూజికల్ చైర్, వంద మీటర్ల పరుగు పందెం, వగైరా పోటీలు జరుగుతున్నాయి.
‘‘ఇయ్యేల కూడా పొండుకోబోయావంట్రా? నాతో బాటే కుసింత గెంజోద్దునుగందా?’’ అంది గైరమ్మ.
‘‘పండ్కొని.. పండ్కొని ఇసుగేత్తందత్తా! నోరు సప్పగైపోనాది. బైటకెల్తే ఏ ఒటేలు బాబైనా నాల్టీసుక్కలోత్తాడేవోనని ఆసి!’’ అన్నాడు ముత్యాలు.
బాటసారులకు నీడగా, చంటిపిల్లలకు ఊయలగా, కుర్రకారుకు కోతికొమ్మచ్చి ఆడే క్రీడా ప్రాంగణంగా, పొలం పనులతో అలసి సొలసిన రైతులు సేదతీరడానికి చల్లని నీడనిచ్చే తల్లిగా, అమాయకపు పల్లెటూరికి స్వచ్ఛమైన ప్రాణవాయువునందించే ఆదర్శమూర్తిగా, అందరి హృదయాలను దోచిన ఆ జడల మర్రిచెట్టు...