కొంచెం ఇష్టం కొంచెం కష్టం

17/05/2012

తెల్లవారింది. ‘‘మామ్మా! నా క్రేయాన్స్ చూశావా? నిన్న ఇక్కడే పెట్టాను’’ అంది నా మనవరాలు.
క్రిష్ణాక్షయం!! మొదలూ వెతుకులాట.. ఇంకో పది నిముషాలలో దాని స్కూల్ బస్సు వచ్చేస్తుంది.

10/05/2012

హఠాత్తుగా ఓ రోజు మధ్యాహ్నం సీతమ్మగారు వచ్చింది మా ఇంటికి. దాదాపు డెబ్బై ఏళ్ళుంటాయి ఆవిడకి. ఇద్దరు కొడుకులు. ఒకతను పూనాలో ఉంటాడు. రెండో అతను ఇక్కడుంటాడు. కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అంతా సందడిగా వుంటుంది. ఈవిడ అటూ, ఇటూ తిరుగుతూ వుంటుంది. సాధారణంగా ఎవరిళ్లకీ రాదు.

03/05/2012

పొద్దున్న పది గంటలైంది. ఫోన్ మోగింది.. ‘హలో’ అన్నాను. ‘‘మేము టీవీ 116 నుంచి మాట్లాడుతున్నాం. మేడం గారున్నారా?’’ అంది అవతలి కంఠం. నా గుండెగుభేలు మంది. ‘లేరు’ అనేశాను వెంటనే.
‘నారీశిరోమణులు అనే ప్రోగ్రాం చేస్తున్నాం. మేడం ఇంటర్వ్యూ కావాలి. ఎప్పుడుంటారు ఇంట్లో?’ మరో ప్రశ్న.

26/04/2012

ఇక నుంచి కథలూ గట్రా రాయడం మానేద్దామని నిర్ణయిం చేసుకున్నా!

19/04/2012

మా చిన్నతనంలో ప్రయాణం అనగానే మా తాతయ్యగారు పంచాంగం తీసుకుని లెక్కలు వేసి, ఇదుగో ఫలానప్పుడు బయలుదేరండి అని ముహూర్తం పెట్టేవారు. సంపూర్ణ భారతదేశ యాత్రకో, ఏ దూర ప్రయాణానికో కాదు.. గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళాలన్నా పంచాంగం చూడాల్సిందే. ముహూర్తం నిర్ణయించాల్సిందే. అబ్బా..

12/04/2012

మా అత్తయ్య ఇంట్లో దాని బెడ్ రూంలో... అదీ నేనూ మా చిట్టీ కూర్చున్నాం. అవడానికి అత్తయ్యే అయినా నాతోటిదే- మళ్లీ మాట్లాడితే రెండు నెలలు చిన్నది నాకంటే... బోలెడంత బంధుప్రేమ దానికి.
ఒక్కతినే చేసుకుని చావలేను. కాస్త సాయం రండే మా తల్లి.. మా తల్లి అంటే వెళ్లాం నేనూ, చిట్టీ.

05/04/2012

హఠాత్తుగా ఓరోజు పొద్దునే్న రావుగారి నుంచి ఫోనొచ్చింది. ఆయన మాజీ సినిమా మనిషి. అప్పుడెప్పుడో సినిమాల స్వర్ణయుగం నడుస్తున్నపుడు సాంకేతిక శాఖల్లో పనిచేసేడు. ఆ తరువాత మానేసి, ఉద్యోగం చేసుకుని రిటైర్ అయి ప్రస్తుతం అమెరికాకు, ఇండియాకు మధ్య బంతిలా తిరుగుతున్నాడు.

29/03/2012

మా శాంత ఫోన్ చేసింది. ‘‘ముందే చెప్తున్నా ఫిబ్రవరి మొదటివారంలో మీరు ఊరొదిలి వెళ్లటానికి వీల్లేదు. అలా వెళ్తే నేనూరుకోను’’ అంది. పోలీసులు దొంగలకి చెప్పినట్ల్లు చెప్పేసరికినాకు భయం వేసింది. ‘‘ఎందుకూ నేనేం నేరం చేసానూ?’’ అని ఆవిడనే అడిగాను.

22/03/2012

‘‘తెలియనప్పుడు తెలియనట్లే వుండటం అలవాటు చేసుకోవాలి. అంతేగానీ ఏదో అవాకులు, చవాకులూ వాగటం ఎందుకు? అందరిలోనూ నవ్వులపాలు అవటం ఎందుకు?’’ గంట సేపటినించి సాధిస్తున్నాడు మా చిన్న మావయ్య.

15/03/2012

మా చిన్నక్కయ్య ఫోన్ చేసింది అమెరికా నుంచి. చచ్చిపోతున్నానే మీ బావతో! ఇదెక్కడ చాదస్తమో బాబూ! అక్కడుంటే కాసేపు బయట తిరిగొచ్చేవారు. కాస్త టైంపాస్ అయ్యేది. ఇక్కడేమో చలీ,మంచూనూ. ఇరవై నాలుగ్గంటలూ ఇంట్లో కూర్చోడమే కదా, నా బుర్ర తింటున్నారు.. వద్దండీ మనకు ఈ గ్రీన్‌కార్డు అంటే అప్పుడు వినలేదు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading