దేశం కోసం ఎండనక, వాననక, ప్రాణాలొడ్డి పోరాడే సైనికులు మాత్రమే ధీరులు, వీరులు కారు. ఆ వీరజవాన్ల వెనుక ఉన్న మహిళలు కూడా అంతే ధీరులు అని చెప్పక తప్పదు. వారి భర్తలు యూనిఫారమ్‌లో ఉన్న వీరులైతే, వారి భార్యలు వారి వెనకాల ఉండి నడిపిస్తున్న శక్తిస్వరూపాలు. అటువంటి ఒక ధీర మహిళ దీపామాలిక్.













