ముంబయి, మే 25: దేశీయ స్టాక్‌మార్కెట్లలో వరుస ఐదు వారాల లాభాలకు బ్రేక్ పడింది. మదుపర్లు భారీ స్థాయిలో లాభాల స్వీకరణకు దిగడంతో అటు సెనె్సక్స్ 20వేల స్థాయికి దిగువకు, ఇటు నిఫ్టీ 6వేల స్థాయి క్రిందకు పడిపోయాయి.
బిజినెస్
ముంబయి, మే 25: దేశీయ స్టాక్‌మార్కెట్లలో వరుస ఐదు వారాల లాభాలకు బ్రేక్ పడింది. మదుపర్లు భారీ స్థాయిలో లాభాల స్వీకరణకు దిగడంతో అటు సెనె్సక్స్ 20వేల స్థాయికి దిగువకు, ఇటు నిఫ్టీ 6వేల స్థాయి క్రిందకు పడిపోయాయి.
న్యూఢిల్లీ, మే 25: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ తమ చిన్న కార్ల విభాగంలో అమ్ముడైన 22,188 యూనిట్ల మైక్రా, సెడాన్ సన్ని మోడళ్లను వెనక్కి పిలవనుంది. వీటిలోని ఓ సమస్యను చక్కదిద్దడంలో భాగంగానే రీకాల్ అని నిస్సాన్ మోటార్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
దుబాయ్, మే 25: అబుధాబికి చెందిన చమురు శుద్ధి సంస్థ తక్రీర్‌తో ఎస్సార్ ప్రాజెక్ట్స్ (ఇపిఎల్) 80 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ తెలిపింది.
బీజింగ్, మే 25: ఎగుమతుల కంటే దిగుమతుల విలువ భారీగా ఉంటుండటంతో అంతకంతకూ పెరిగిపోతున్న వాణిజ్య లోటు నేపథ్యంలో భారత్ నుంచి ఓ ఉన్నతాధికార వాణిజ్య బృందం చైనాలో పర్యటించబోతోంది. వచ్చేవారం ఇక్కడ పర్యటించనున్న ఈ బృందం..
ముంబయి/న్యూఢిల్లీ, మే 25: దేశ ఆర్థిక వ్యవస్థ తర్వలోనే తిరిగి పుంజుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. పతనమవుతున్న వృద్ధిరేటు మళ్లీ గాడిలో పడుతుందని, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈసారి కనీసం ఒక్క శాతమైన పెరుగుతుందనే విశ్వాసాన్ని వెలిబుచ్చారు.
ముంబయి, మే 24: జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటాను అబు దుబాయ్‌కి చెందిన ఎతిహాద్ సంస్థకు విక్రయించేందుకు ఆ కంపెనీ వాటాదారులు ఆమోదించారు. శుక్రవారం జెట్ ఎయిర్‌వేస్ నిర్వహించిన ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో వాటా అమ్మకం వ్యవహారాన్ని వాటాదారులు ఆమోదించారు.
ముంబయి, మే 24: సెబీ పటిష్ఠతకు చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం హామీ ఇస్తూనే, ఇన్‌సైడర్ ట్రేడింగ్ కట్టడికి చర్యలు తీసుకుని చిన్న మదుపరులు ఈక్విటీలలో పెట్టుబడులను పెట్టేందుకు ప్రోత్సహించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని ఆయన కోరారు.
ముంబయి, మే 24: దేశంలో వివిధ సంస్థలు మోసపూరిత పథకాల ద్వారా నిధులను సమీకరిస్తూ ప్రజలను మోసగిస్తున్నాయని, ఇది ఆందోళనకరంగా మారిందని సెబీ చైర్మన్ యుకె సిన్హా శుక్రవారం చెప్పారు. అటువంటి పథకాలు, సంస్థలపై కఠినచర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.
హైదరాబాద్, మే 24: దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిపై నిర్మిస్తున్న ఓడరేవుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 46 శాతం ఉందని, వీటి విలువ 20090 కోట్ల రూపాయలని అసోచామ్ సదరన్ రీజనల్ కౌన్సిల్ చైర్మన్ రవీంద్ర సన్నారెడ్డి చెప్పారు.
ముంబయి, మే 24: వరుసగా నాలుగు రోజుల నష్టాల అనంతరం శుక్రవారం ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెనె్సక్స్ 30 పాయింట్లు లాభపడింది. టాటా స్టీల్ నికర లాభం 5 శాతం పెరగడం, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ రంగానికి చెందిన స్టాక్స్ లాభపడడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడి నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది.