ప్రతి మనిషికి సందేహాలు అనేవి ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉంటాయ. అసలు సందేహం లేనివారు అరుదు అనే చెప్పచ్చు. మరీ ఎక్కువ అనుమానాలు పెట్టుకునేవారిని సందేహజీవి అంటూఉంటాం. నమ్మకం అనే వస్తువు మనిషి ఉన్నతశిఖరాలకు తీసుకెళ్లితే అనుమానమనే వస్తువు మనిషి అధః పాతాళలోకానికి నెట్టివేస్తుంది.




