పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఆదివారం అరవై వసంతాలు పూర్తి చేసుకున్నది. 1952 మే 13 తేదీనాడు లోక్‌సభ, రాజ్యసభల మొదటి సమావేశం జరిగింది. లోక్‌సభ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సమావేశమైతే రాజ్యసభ పాత ఢిల్లీలోని రాజ్యాంగ చట్ట సభలో సమావేశమై ప్రజాస్వామ్య వ్యవస్థకు శ్రీకారం చుట్టాయి.













