సంపాదకీయం

21/05/2012

త్వరలో జరుగనున్న శాసనసభ ఉప ఎన్నికల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున ‘కేంద్ర దర్యాప్తు విభాగం-సిబిఐ-వారు భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తుండడం సమకాలీన రాజకీయ వైచిత్రి.

19/05/2012

‘ప్రపంచీకరణ’ ప్రభావం ప్రస్ఫుటించడం ఆరంభమైంది! అర్ధంకాని, ఆర్థిక వైపరీత్యం మన రూపాయి నానాటికీ కృశించిపోతుండడానికి కారణమైంది! సామాన్య ప్రజలకు అర్ధంకాకపోవడంలో ఆశ్చర్యం లేదు.

18/05/2012

అసంభవమనుకొన్నది సంభవిస్తూ ఉంది. నేపాల్‌లో నూతన రాజ్యాంగపు ముసాయిదా రూపొందింది. దాదాపు ఆరేళ్ళపాటు నత్తనడకతో పోటీపడిన ప్రజాస్వామ్య ప్రక్రియ గత ఆరు వారాల్లో ఊహించని రీతిలో వేగం పుంజుగొనడం ఈ ముసాయిదా సిద్ధం కావడానికి దోహదపడింది!

17/05/2012

దేశ వ్యాప్తంగా ఎయిరిండియా పైలెట్లు గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మె రోజురోజుకూ తీవ్రతను సంతరించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కూడా ఈ తరహా సమ్మెలు జరిగినా పరిస్థితి ఇంత దీర్ఘకాలం సాగిన సందర్భాలు అరుదే!

16/05/2012

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప భారతీయ జనతాపార్టీ అధిష్ఠాన వర్గాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న తీరు ఆ పార్టీని నవ్వులపాలు చేస్తోంది!

15/05/2012

నేపాల్‌లో కొత్త రాజ్యాంగం ఏర్పాటు ఎప్పటికప్పుడు ఎండమావినే తలపిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య జాతీయ ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరినా... నిర్ణీత కాల వ్యవధిలో కొత్త రాజ్యాంగ ఆవిర్భావం అనిశ్చిత పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

14/05/2012

ఎయిర్‌సెల్, మాక్సిస్ కంపెనీలకు రెండవశ్రేణి టెలికామ్-2జి స్పెక్టరమ్- తరంగాలు కేటాయింపుకు సంబంధించిన కుంభకోణం చిటపటలు దేశవ్యవహారాల మంత్రి పళనియప్పన్ చిదంబరం చట్టూ వికృత విన్యాసాలన్నీ ప్రదర్శించడం మరికొంత కాలం ఆగకపోవచ్చు. ఈ చిటపటల ప్రతిధ్వనులు పార్లమెంటులో వినబడుతుండడం వర్తమాన వైపరీత్యం.

12/05/2012

పాకిస్తాన్‌లోని హిందువులను అణచివేస్తుండడం గురించి ఆలస్యంగానైనా మనదేశంలో ‘కదలిక’ సంభవించడం హర్షణీయం. నిజానికి ఈ దురంతం గురించి గత ఏడాది మన పార్లమెంటులో చర్చ జరుగవలసి ఉంది. అసలు జరగకపోవడం కంటె ఇప్పుడిలా మన ప్రభుత్వం, పార్లమెంట్ ప్రతిస్పందించడం సాహసోపేతమైన చర్య.

11/05/2012

ఇసుక తవ్వకాలపై నిరవధికంగా నిషేధం కొనసాగడానికి రంగం సిద్ధమైపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకుల అవకతవక పాలనకు అద్దం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వారు ఇసుక దోపిడీ దారులను నియంత్రించడంలో నిర్లక్ష్యాన్ని వహించిన కారణంగా ఇప్పుడు నిర్మాణ కలాపాలకు ‘ఇసుక రేణువు’సైతం దొరకని స్థితి దాపురించనుంది.

10/05/2012

ఆచితూచి అడుగు వేసి అనుకున్నది సాధించుకోవడమే రాజనీతిజ్ఞత.. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఆరితేరిన నిష్ణాతులు మాత్రమే ఉభయతారకమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఇందుకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తాజాగా వేసిన అడుగే నిదర్శనం.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading