తకిట తకిట

20/05/2012

నవ్వూ మందే. ఇది తెలిసిపోయాక, పార్కుల్లో పువ్వులు బదులు, నవ్వులు పూసేస్తున్నాయి. చెట్లు కాదు, చెట్లంతటి మనుషులు నవ్వేస్తున్నారు. ఎవరో చచ్చిపోతే, గుమిగూడి ఏడ్చినంత బిగ్గరగా గుండెలు పగిలేలా నవ్వేస్తున్నారు.

05/05/2012

ఎదగ వచ్చు.
ఎవ్వరు ఎలాగయినా ఎదగవచ్చు. నిలువుగా ఎదగవచ్చు. అడ్డంగా ఎదగవచ్చు.
లేదూ ముందు అడ్డంగా ఎదిగి, తర్వాత నిలువుగా ఎదగవచ్చు.
ఎదగటం- ముఖ్యమనుకుంటే చాలు.

29/04/2012

'కుట్టాలని ఉంది’
‘ఎవర్నీ? నన్నా?’

21/04/2012

వారు కలవరు. విడిపోరు.
ఎవరనుకున్నారు? రోజూ కొట్టుకు చచ్చే భార్యాభర్తలు కారు.
కలి ‘విడి’గా పనిచేసే కమ్యూనిస్టు పార్టీలు. దేశంలో ఎలా వున్నా, రాష్ట్రంలో మాత్రం ఇదే తంతు.
ఒకే జెండా. ఒకే ఎరుపు. ఒకే సుత్తీ. ఒకే కొడవలి. కానీ పట్టుకునే చేతులు వేరు. ఒకటి: సిపిఐ, రెండు: సిపిఎం.

15/04/2012

‘తార’ల్ని సృష్టించ వచ్చు. కూల్చేయ వచ్చు.
చాలా తారలు స్వయంప్రకాశకాలు కావు. ముఖ్యంగా వెండితెర మీద తారలు ఆస్సలు కారు. ముఖానికి అంగుళం మందాన మేకప్ కొట్టి, ఫ్లడ్‌లైట్లు వేస్తేనే కానీ కనిపించరు.
వాళ్ళు కొట్టే పంచ్ డైలాగుల్లో, పంచ్ వాళ్ళదీ కాదు, డై‘లాగు’ వాళ్ళది కాదు. ఎవరో రైటర్‌ది.

07/04/2012

‘పారం చెప్పటం’ వేరు. గుణపాఠం చెప్పటం వేరు.
ఈ రెండూ కాకుండా, ‘క్లాసు పీకటం’ వేరు.
అనగనగా ఓ అందమైన ఆడపిల్ల. ఆమె వెంట ముగ్గురు.

31/03/2012

ప్రవేశ పరీక్షలు రాజకీయాల్లో కూడా తప్పవు.

25/03/2012

తీర్పులు ఎక్కడయినా ఒక్కటే. అవి ఓర్పునకు పరీక్షలు.

18/03/2012

రైళ్ళు పట్టాలపైనా, బస్సులు రోడ్లపైనా, విమానాలు మబ్బులు పైనా నడుస్తాయని- చెబితే ఎల్‌కేజీ కుర్రాడు కూడా నమ్మడు. వాహనం ఏదయినా నడిచేది ధరల పైన.
కేంద్రంలో ఒకప్పటి ఎన్డీయే సర్కారయినా, ఇప్పటి యుపీయే ప్రభుత్వమయినా నడిచేది పాలసీల మీద కాదు. ఉత్త పొత్తుల మీద.

10/03/2012

గుడ్డొచ్చి ప్రతీసారీ పిల్లను వెక్కిరించదు. ఒక్కొక్కసారి రక్షిస్తుంది. తాతకు దగ్గుల్నే కాదు, పెగ్గుల్ని నేర్పించే మనుమలుంటారు. తండ్రిని మించిన... కాదు, కాదు, తండ్రిని పెంచిన తనయులు కూడా వుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ములాయం పరపతిని, అఖిలేష్ అలాగే పెంచారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading