తోవ్వ ముచ్చట్లు - జయదిర్

20/05/2012

ఎనిమిది వందల ఏళ్ళుగా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలిచిన రామప్ప ఆలయం కట్టడం మానవ తప్పిదంవల్ల నేలగర్భంలో కలసిపోయేది. కాని ప్రజలు అప్రమత్తమై ముక్తకంఠంతో ఆపద కళ్ళముందే కనిపిస్తోందని నిలదీశారు.

05/05/2012

కళ్ళముందు నిత్యం కనుపించే మహిళా కళాకారులను గుర్తించం. వారి పాత్రని గుర్తించ నిరాకరించే స్వభావం మనలో తిష్టవేసుకుంది కాబట్టే గుర్తించం.

29/04/2012

భారతదేశంలోని పౌరుల శరీరాలలోకి ప్రతిరోజు వందల టన్నుల విదేశీ మందులు సరఫరా అవుతున్నాయి. వందల కోట్ల విలువచేసే ఈ విదేశీ మందులు చాలావరకు విష పదార్థాలుగానే చేరుతున్నాయి. నిజానికి ఈ మందులు ముందు పరీక్షింపబడిన తరువాతే అవసరంకోసం వాడబడుతున్నాయా అనేది ఒక ప్రశ్న.

21/04/2012

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతే ముఖ్యం. ఆరోగ్యంకోసం మందూమాకులూ అవసరమే. ఇవ్వాళటికీ దేశంలో సగానికి పైగా జనాభాకి దేశీయ వైద్యమే గతి అని అంటారు. నిజానికి ‘గతి’ పదంలోనే దేశీ వైద్యాన్ని తక్కువచేసి చూసే దృష్టి ఉంది.
నిజానికి దేశీ వైద్యం తక్కువదా?

15/04/2012

చిన్ననాటి నాగ స్వరం ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. రాబోయే తరం వారికి ఈ అవకాశం ఉండదేమో.

07/04/2012

విశ్వాసాలు కొన్ని చెక్కుచెదరవు. మరికొన్ని మారుతూ ఉంటాయి. వాస్తవాధారిత విశ్వాసాలు కాలానికి ఎదురు నిలిచి నిలుస్తాయి.

31/03/2012

పోరు ప్రవాహంలో నిలిచిన కవి సుంకర. ఇలాంటి కవులు చాలా తక్కువ. గట్టు మీద కేకలు వేసే ‘మహాకవులు’ చాలామంది. వీళ్ళకే అవార్డులూ, రివార్డులూ. శత జయంతులూ... అన్నీ! వాస్తవాల కప్పదాట్లతో మహాకవిని నిర్మించిన ప్రగతిశీల భూస్వామ్యం మనది. అర్థవలస, అర్ధ భూస్వామ్యం అనే కమ్యూనిస్టుల నిర్వచనం సరైనదే.

25/03/2012

అవార్డులకోసం ఎదురుచూడని వాడిని, వెతుక్కుంటూ సినిమా అవార్డు మెడలో వాలడం చూసేవాడికి కాస్త గమ్మత్తుగానే ఉంటుంది.
చూసేవాడు వల్గర్ ఇష్టపడుతున్నాడని సినిమాలు తీసే ప్రధాన స్రవంతిని పక్కనపెట్టి సమాంతర సినిమా సంస్కృతికి తోవ వేయడం మామూలు విషయం కాదు.

18/03/2012

దిగలకు జాంబవుడు కులపురుషుడు. అతని పేరనే జాంబపురాణం నేటికీ పాడుకుంటారు. మరి మాలలకు ఎవరు? మాల చెన్నయ్యని కులపురుషుడిగా భావిస్తారు. అతని ప్రసక్తి రాత, నోటి సాహిత్యాలలో అక్కడక్కడ కనుపిస్తుంది. కాని చెన్నయ్య పురాణం పాఠ్యం మాత్రం లభించడం లేదు.

10/03/2012

భారతదేశంలో కళ సామాజికం. క్రతువు కూడా. అందుకే అది సామూహికం. ప్రతి కళ/ప్రదర్శన/ కథాగానం చాలా ప్రాచీనం. ముఖ్యంగా జానపద, గిరిజన కళలు. వాటికి చారిత్రకత పెనవేసుకుని ఉంటుంది. సామాజిక విలువ సైతం రుద్దబడి ఉంటుంది. మానవ పరిణామక్రమంతో ముడివడి ఉన్నదే కళ.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading